ఆప్తుని కన్నుమూత.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ కన్నుమూశారు. దీంతో భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో మొదలైన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చూసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:34 am, Mon, 6 May 19
ఆప్తుని కన్నుమూత.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ కన్నుమూశారు. దీంతో భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో మొదలైన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చూసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడుగా ఉన్న వారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతున్నాను’’ అంటూ పోస్ట్ చేశారు.

https://www.facebook.com/jrntr/posts/2349710495093046