AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో తమిళ హీరో.. యంగ్ టైగర్‏కు ప్రతినాయకుడిగా ఆ కోలీవుడ్ స్టార్..

ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకదీరుడు రాజమౌళి నిర్మిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో తమిళ హీరో.. యంగ్ టైగర్‏కు ప్రతినాయకుడిగా ఆ కోలీవుడ్ స్టార్..
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2021 | 4:44 PM

Share

ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకదీరుడు రాజమౌళి నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తవగానే ఎన్టీఆర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోననున్నాడు. తాజాగా ఈ మూవీకి గురించి మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్‏గా తమిళ స్టార్ హీరో నటించనున్నట్లుగా సమాచారం.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో రూపొందనున్న సినిమాలో యంగ్ టైగర్‏కు ప్రతినాయకుడిగా తమిళ స్టార్ హీరో శింబు నటించనున్నాడట. అంతేకాకుండా ఈ మూవీలో కమెడియన్ సునీల్ కూడా విభిన్నంగా మరో విలన్ పాత్రలో నటించనున్నట్లుగా టాక్. ఇదిలా ఉండగా… ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు.. ఒక హీరోయిన్‏గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్‏ను తీసుకోనున్నట్లు తెలిస్తోంది. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానున్నట్లుగా సమాచారం.

Also Read:

ఒకే సినిమాలో 140 మంది స్టార్స్.. మెగా మల్టీసారర్‏కు సిద్దమైన సినీ ఇండస్ట్రీ.. అసలు కారణం ఎంటంటే..