AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Ajith Kumar : బైక్ రేసింగ్ నేపథ్యం అజిత్ ‘వాలిమై’.. స్పెయిన్‌‌‌‌‌కు పయనమైన చిత్రయూనిట్..

తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం 'వాలిమై' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమిళ్ హీరోల్లో...

Hero Ajith Kumar : బైక్ రేసింగ్ నేపథ్యం అజిత్ 'వాలిమై'.. స్పెయిన్‌‌‌‌‌కు పయనమైన చిత్రయూనిట్..
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2021 | 5:01 PM

Share

Valimai Movie : తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమిళ్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈ స్టార్ హీరో నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అజిత్ నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతున్నాయి. ఇక హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ .

ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది.ఇప్పుడు చిత్రయూనిట్ అంతా స్పెయిన్ కి పయనం కానున్నారు. అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారట. స్పెయిన్‌లో తీసే యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట ఇక ఇప్పటివరకు ఈ సినిమానుంచి ఎలాంటి పోస్టర్స్ విడుదల చేయలేదు. అజిత్‌ పుట్టిన రోజు సందర్భంగా మే లో ‘వాలిమై’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారని కోలీవుడ్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని టాలీవుడ్ యంగ్  కార్తికేయ కీలకపాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో తమిళ హీరో.. యంగ్ టైగర్‏కు ప్రతినాయకుడిగా ఆ కోలీవుడ్ స్టార్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్