Ranbir Kapoor: అంతా తూచ్.. రణ్‌బీర్ అభిమాని ఫోన్ విసిరేయడం వెనకాల అసలు కారణం ఇదే..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు, ఏది, ఎందుకు వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కన్నులతో చూసేదంతా నిజం కాదనిపించేలా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చేసిన ఓ పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ అభిమాని..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు, ఏది, ఎందుకు వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కన్నులతో చూసేదంతా నిజం కాదనిపించేలా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చేసిన ఓ పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ అభిమాని రణబీర్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అభిమానికి సెల్ఫీ తీసుకోవడానికి రణబీర్ అవకాశం కల్పించాడు.
అయితే ఫోన్ సరిగా పనిచేయలేదో, మరే కారణమో కానీ రెండు మూడు సార్లు ప్రయత్నించాడు. అయితే రణబీర్ మాత్రం నవ్వుతూనే అతనికి ఫొటో తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మరోమారు సెల్ఫీ తీసేందుకూ ప్రయత్నించినా స్మైల్ ఇచ్చారు. ఇక మూడో సారి ఫొటో తీసేందుకు ప్రయత్నించగానే రణబీర్ సహనం కోల్పోయాడు. వెంటనే అభిమాని చేతిలోని ఫోన్‌ను లాక్కొని వెనక్కి విసిరేశాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎంత స్టార్ హీరో అయితే మాత్రం ఇంత ఆటిట్యూడ్ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
పాత వీడియో..
Shocking ? Ranbir Kapoor THROWS Fan’s Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— $@M (@SAMTHEBESTEST_) January 27, 2023
అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అసలు విషయం ఏంటో తెలిసింది. నిజానికి ఈ వీడియో ఓ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రమోషన్ కోసం చిత్రీకరించింది. ఒప్పో సంస్థ తమ ఫోన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇలా వినూత్నంగా యాడ్‌ను డిజైన్ చేసింది. అభిమాని ఫోన్‌ను విసిరేసిన తర్వాత రణబీర్ అతనికి ఒప్పోకు చెందిన బ్రాండ్ న్యూ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇది అసలు యాడ్ ఉద్దేశం. అయితే ఈ యాడ్‌లో కొంచెం పార్ట్‌ను కట్ చేసి నెట్టింట వైరల్ చేశారు. దీంతో రణబీర్ ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఫుల్ వీడియో మళ్లీ నెట్టింట వైరల్ అవుతుండడంతో అసలు విషయం ఇదా అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.
అసలు వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..