అమితాబ్ గురించి అత్యంత సీక్రెట్స్.. ఏంటంటే.. !
నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఆ ఎత్తు ఏంటి..? ఆ ఫేసు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ..? నువ్వు కూడా హీరో అవ్వాలనుకుంటున్నావా..? నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు..! ఇలా కెరీర్ ప్రారంభంలో ఆయనను అనకూడని మాటలన్నారు. ఇప్పుడే అదే వాయిస్ భారత సినిమాను శాసిస్తోంది. ఆ హైట్, అదే ఫేస్ ఆయనను మెగాస్టార్ చేసింది. భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌ను అందుకున్న ఆయన.. త్వరలో భారత సినిమాకు […]
నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఆ ఎత్తు ఏంటి..? ఆ ఫేసు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ..? నువ్వు కూడా హీరో అవ్వాలనుకుంటున్నావా..? నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు..! ఇలా కెరీర్ ప్రారంభంలో ఆయనను అనకూడని మాటలన్నారు. ఇప్పుడే అదే వాయిస్ భారత సినిమాను శాసిస్తోంది. ఆ హైట్, అదే ఫేస్ ఆయనను మెగాస్టార్ చేసింది. భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌ను అందుకున్న ఆయన.. త్వరలో భారత సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకోబోతున్నారు. ఇంత చదివాక.. ఆయనెవరో తెలుసుకునేందుకు సమయాన్ని వెచ్చించి మరీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనే వెండితెర యాంగ్రీ యంగ్ మ్యాన్, ఎవర్ గ్రీన్ స్టార్.. బాలీవుడ్ బిగ్‌బీ.. అమితాబ్ బచ్చన్.
ఇండియన్ మూవీ హిస్టరీ అనే పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని రాసుకున్న అమితాబ్… 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జన్మించారు. తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన సిక్కు మహిళ. అమితాబ్‌కు మొదట వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘ఇంక్విలాబ్’. ఆ తర్వాత అమితాబ్‌గా మార్చారు. దాని అర్థం ఎప్పటికీ ఆరని దీపం. అందుకు తగ్గట్లుగానే 77 సంవత్సరాలు వచ్చినా.. యువ హీరోలకు ధీటుగా నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు బిగ్‌బీ.
కాగా సినిమాల్లో అమితాబ్ కెరీర్ మొదట వాయిస్ నేరేటర్ గా మొదలైంది. 1969లో బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘భువన్ షోమ్’ తో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1969లో ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ డైరెక్ట్ చేసిన ‘సాత్ హిందుస్థానీ’ చిత్రంలో ఏడుగురు హీరోల్లో ఒకడిగా నటించారు. సినిమా హిట్ కాలేదు. కానీ, అమితాబ్ క్లిక్ అయ్యాడు. తొలి చిత్రంతోనే బెస్ట్ న్యూ కమర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అమితాబ్ కెరీర్‌లో నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే కావడం విశేషం. ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఏం లాభం.. 12 ఫ్లాప్‌లు పడ్డాయి. ఇలాంటి సమయంలో ఆయనకు మొదట హిట్ ఇచ్చిన చిత్రం జంజీర్. ఈ సినిమాలో ఆయన పేరు విజయ్. ఆ సెంటిమెంట్‌తోనే ఆ తరువాత దాదాపు 20 సినిమాల్లో అదే పేరుతో నటించారు బిగ్‌బీ..
ఇక పుణె టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియాలో తొలిసారి జయ బాధురిని కలిసిన బిగ్‌బీ.. గుడ్డి సినిమా సెట్‌లో రెండోసారి చూశారు. క్రమంగా వీరిద్దరి మధ్య ప్రేమ పెరగగా.. 1973లో అమితాబ్, జయబాధురిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అభిషేక్, శ్వేతా నందన్ పిల్లలు.
అమితాబ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:
- బాలీవుడ్‌లో ఎక్కువ డబుల్ యాక్షన్ పాత్రలు చేసిన నటుడు బిగ్‌బీనే.
- ఆయన ఆండీడెక్స్‌ట్రస్. అంటే రెండు చేతులతో రాయగలరు.
- అమితాబ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనుకున్నారు. అలాగే ఇంజినీర్ అవ్వాలన్న కోరిక ఉండేది
- 1995లో జరిగిన మిస్ వరల్డ్ కాంటెస్ట్‌కు అమితాబ్ జడ్జ్‌గా వ్యవహరించారు.
- గ్రేట్ గాట్స్ బీ అనే హాలీవుడ్ మూవీలోనూ ఆయన నటించారు.
- జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా నాలుగు అవార్డులు అందుకున్న ఏకైక నటుడు అమితాబ్ కావడం విశేషం.
- ఆయన మద్యపానీయాలు, శీతల పానీయాలు, ధూమపానం, స్వీట్లు, పాన్లు.. ఇలా ఆరోగ్యంపై దుష్ఫ్రాభావాన్ని చూపే అన్నింటికి దూరంగా ఉంటారు. అంతేకాదు ఆయన పూర్తి శాఖాహారి. అందుకే ఈ వయసులోనూ ఆయన ఫిట్‌గా ఉంటారు.
- అమితాబ్‌కు చేతి గడియారాలు కలెక్ట్ చేయడమంటే చాలా ఇష్టం. ఎప్పుడు బయటికి వెళ్లినా.. ఆయన రెండు వాచ్‌లు పెట్టుకొని వెళుతుంటారు.
- ప్రతి ఆదివారం ఆయన నివాసం వద్ద అభిమానులను పలుకరిస్తుంటారు.
- భారత్ నుంచే కాదు ఆసియా నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన మొదటి యాక్టర్ బిగ్‌బీనే.
- 1982లో ‘కూలీ’ షూటింగ్ సమయంలో ఒక ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన కోలుకోవాలంటూ దేశ వ్యాప్తంగా లక్షలాది అభిమానులు ప్రార్థించారు. అంతేకాదు ఆయన చికిత్స కోసం 60 బాటిట్ల రక్తాన్ని అభిమానులు పంపించారు.
- దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో సత్సంబంధాలు కలిగిన ఉన్న బిగ్ బీ.. ఆయన ఆదేశాలతో 1984లో అలహాబాద్ పార్లమెంట్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
- ఏబీసీఎల్ కార్పోరేషన్ స్థాపించి దివాళ తీసినా.. తన ఆస్తులను అమ్మి మరీ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులను వారికి చెల్లించారు.
- సునీల్ దత్ సినిమా ‘రేష్మా ఔర్ షేరా’లో ఒక మూగవాడి పాత్రకోసం అమితాబ్‌ని ఎంపిక చేశారు. అమితాబ్‌కు ఆ అవకాశం ఇప్పించడం కోసం స్వయంగా ఇందిరా గాంధీ తన స్నేహితురాలైన నర్గీస్‌కు లేఖ రాయడం విశేషం.
- 2007లొ ఫ్రెంచ్ ప్రభుత్వం సినీ పరిశ్రమలో ఆయన సేవలకు గానూ ఆ దేశ అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్‌తో సత్కరించింది.
- 2012 ఒలింపిక్స్ సమయంలో లండన్‌లోని సౌత్‌వార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఒలింపిక్ టార్చ్‌ను పట్టుకొన్నారు.
- కోల్‌కతాలో అభిమానులు అమితాబ్‌కు ఓ గుడిని కట్టారు. అందులో ఇప్పటికీ ఆయన విగ్రహానికి పూజలు జరుగుతుంటాయి.
- తెలుగులో మొదట మనం సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన బిగ్‌బీ.. ఇటీవల చిరంజీవి నటించిన సైరాలో కీలక పాత్రలో కనిపించారు.