Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Writer Prasanna kumar : ఆ హీరో ఫ్యాన్స్ రాత్రిపూట మా ఇంటికి వచ్చారు : రైటర్ ప్రసన్న కుమార్

Rajeev Rayala

|

Updated on: Mar 08, 2025 | 5:27 PM

మహాశివరాత్రి సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చింది మజాకా సినిమా. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తెరకెక్కించారు. ఇందులో రావు రమేశ్ కీలకపాత్రలో నటించగా.. రీతూ వర్మ కథానాయికగా కనిపించింది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టోరీ రైటర్ ప్రసన్న కుమార్ ఆసక్తికర ఇంటర్వ్యూ. అనేక ప్రశ్నలకు మజాకా మూవీ రైటర్ ప్రసన్న  కుమార్ ఆసక్తికర సమాధానాలు తెలిపారు. మజాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఎలా అనిపిస్తుంది.? , మజాకా సినిమా మీరు అనుకున్నంత విజయాన్ని అందుకుందా.? ఇంతకు మించి ఎక్స్‌పెట్ చేశారా.? , ఒక కథ అనుకున్నప్పుడు హీరో బాడీ ల్యాంగ్వేజ్ ను బట్టి డైలాగ్స్ రాస్తారా..? లేక కథకు తగ్గట్టుగా రాస్తారా.? , మీరు వర్క్ చేసిన హీరోల్లో నా డైలాగ్స్ ఈయన బాగా చెప్పాడు అని అనిపించిన హీరో ఎవరు.? , ఎందుకని సందీప్ కిషన్ తో సినిమా లెట్ అయ్యింది..?

సినిమా చూపిస్తా మావ సినిమా నుంచి ఇప్పటివరకు మీరు రాసిన కథల్లో ఇది నా బెస్ట్ కథ అనిపించినా సినిమా ఏది.? ఎందుకు.?  నాని, విశ్వక్ సేన్ , రామ్ పోతినేని, రవితేజ ఇలా హీరోలకు రాసారు.. ఎందుకని బడా హీరోల సినిమాలు వర్క్ చేయలేదు.. ఆఫర్ రాలేదా.? లేక మీరే ఆసక్తి చూపించలేదా.? మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఎవరితో వర్క్ చేయాలనీ ఉంది.? చేస్తే ఎలాంటి కథ చేస్తారు.? ఇలా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు ప్రసన్న కుమార్.