శ్రీలీల సినిమాలో డేవిడ్ వార్నర్.. వీడియో
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చాలా మందికి తెలుసు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే అనేక ప్రకటనలలో కనిపించారు. ఇప్పుడు తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించిన మైత్రీ బ్యానర్‌లో డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ సంస్థ నిర్మిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తమ సినిమాలో అవకాశం ఇచ్చింది. ఈ సంస్థ నిర్మిస్తున్న రాబిన్‌హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఓ ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పారు. ‘రాబిన్ హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. డేవిడ్ వార్నర్ అభిమానులు అతన్ని పెద్ద తెరపై చూసేందుకు ఎదురు చూస్తున్నారు. డేవిడ్ వార్నర్ వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఆయనకు తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధం ఉంది ‘రాబిన్ హుడ్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డేవిడ్ వార్నర్ తాలూకు షూటింగ్ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తుండగా..చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. 2025 IPL లో డేవిడ్ వార్నర్ ను ఎవరూ తీసుకోలేదు. అతని బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
