09 March 2025

18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకై తల్లైంది.. రెండుసార్లు విడాకులు.. ఎవరంటే

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి రెండుసార్లు ప్రేమలో మోసపోయింది.

హిందీలో పలు సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై తన నటన, అందంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది బ్యూటీ.

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. అందులో విజేతగా నిలవడంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చేసింది. నెట్టింట ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. 

సినిమాలతోపాటు సీరియల్స్, టీవీ షోల ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ శ్వేత తివారి. 

‘కసౌటి జిందగీ కె’ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

1998లో నటుడు రాజా చౌదరిని పెళ్లి చేసుకుంది. వీరికి పాలక్ తివారి జన్మించింది. వీరిద్దరు 2007లో మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. 

2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించారు. 2019 తన రెండో భర్తతోనూ విడాకులు తీసుకుంది శ్వేతా తివారీ. 

నివేదికల ప్రకారం శ్వేతా తివారీ ఆస్తులు రూ.81 కోట్లు ఉన్నట్లు సమాచారం. బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి ఆమె కావడం విశేషం.