బాలీవుడ్ బ్యూటీ ఫోన్ నెంబర్ కోసం విజయ్ ఆరాటం.. ఇంతకీ సాధించాడా?

విజయ్ దేవరకొండ..ఈ నేమ్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలు విజయ్‌ను అమాంతం స్టార్ హీరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, తనకు మాత్రమే సాధ్యమైన యూనిక్ డైలాగ్ డెలివరీతో విజయ్..యూత్‌ను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక మరోవైపు బ్రాండింగ్‌ను ఈ యంగ్ హీరో ఎవరికి అందనంత ఎత్తులో దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ఫేమస్ ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఫొటో షూట్ ఇచ్చాడు విజయ్. […]

బాలీవుడ్ బ్యూటీ ఫోన్ నెంబర్ కోసం విజయ్ ఆరాటం.. ఇంతకీ సాధించాడా?
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 11, 2019 | 1:24 PM

విజయ్ దేవరకొండ..ఈ నేమ్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలు విజయ్‌ను అమాంతం స్టార్ హీరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, తనకు మాత్రమే సాధ్యమైన యూనిక్ డైలాగ్ డెలివరీతో విజయ్..యూత్‌ను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక మరోవైపు బ్రాండింగ్‌ను ఈ యంగ్ హీరో ఎవరికి అందనంత ఎత్తులో దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ఫేమస్ ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఫొటో షూట్ ఇచ్చాడు విజయ్. ఈ సందర్భంగా జరిగిన  ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆయన ఓ బాలీవుడ్ హీరోయిన్ నెంబర్ కావాలని..టైం కానీ టైంలో ఏకంగా ఓ బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాతకే ఫోన్ చేశాడంట. ఇంతకీ విజయ్‌ను అంతలా మెల్ట్ చేసిన ఆ సుందరాంగి ఎవరనుకుంటున్నారా?..యంగ్ అండ్ టాలెంటెడ్ ఆలియా బట్. బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతోనే ఆలియా హిందీ సినిమాకు పరిచయమైంది. అందుకే ఆమె కరణ్‌ను ఒక మెంటర్‌లా భావిస్తుంది. ఇది పసిగట్టిన యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఏకంగా కరణ్ జోహార్‌కు కాల్ చేసి..ఆలియా బట్ నెంబర్ కావాలని అడిగాడట. ఈ విషయాన్ని విజయ్‌నే రీసెంట్ ‌ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘టైం కాని టైంలో నేను ఓసారి కరణ్ జోహార్‌కు ఫోన్ చేశాను. ఆలియా భట్ నెంబర్ కావాలని అడిగాను. మీరు మరోలా అనుకోకండి. ఆలియా నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా చూశాక అందులో ఆమె నటన చాలా నచ్చింది. సినిమా చూశాక అసలు నాకు నిద్ర పట్టలేదు. అందుకే ఆలియాకు కంగ్రాట్స్ చెప్పాలని నెంబర్ అడిగాను’ అని అసలు విషయం చెప్పాడు విజయ్ దేవరకొండ. జోయా అక్తర్ తెరకెక్కించిన ‘గల్లీ బాయ్’ సినిమాలో ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించారు. ఓ పేదకుటుంబానికి చెందిన ర్యాపర్ తన కలలను ఎలా సాకారం సాధించాడన్నది ఈ మూవీ ప్రధాన కథాశం. ‘గల్లీ బాయ్’ సినిమా మంచి విజయం సాధించడమే కాదు ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ బరిలోనూ బెస్ట్ ఫారిన్ సినిమా కేటగిరీలో నిలిచింది.