ర’కూల్’ సీక్రెట్స్.. క్రేజీ అండ్ నాటీ గురూ!

‘కెరటం’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రకుల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఆమె తన […]

ర'కూల్' సీక్రెట్స్.. క్రేజీ అండ్ నాటీ గురూ!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 11, 2019 | 6:13 AM

‘కెరటం’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రకుల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఆమె తన బర్త్‌డేకు తల్లిదండ్రులతో థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్ళింది. ఇలాంటి తరుణంలో రకుల్ ప్రీత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ …

రకుల్ అంటేనే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఫిట్‌నెస్. రకుల్‌కు ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ టిప్, యోగాసనాలను తన ఫ్యాన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూనే ఉంటుంది. అంతేకాక పలు చోట్ల ఫిట్‌నెస్ సెంటర్లు పెట్టి ఆరోగ్యం పట్ల అందరికి అవగాహన కలిగిస్తోంది. ఇక తన బర్త్‌డే నాడు కూడా ఫిట్‌నెస్ గురించి మర్చిపోకుండా యోగాసనం వేసిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

ఎక్స్‌పరిమెంటల్ పాత్రలకు సై అంటున్న రకుల్…

మున్ముందు మరిన్ని ఎక్స్‌పరిమెంటల్ క్యారెక్టర్స్ చేయడానికే మొగ్గు చూపుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటివరకు పలు రకాల వైవిధ్యమైన పాత్రల్లో అలరించిన ఆమె.. భవిష్యత్తులో నెగటివ్ షేడ్ పాత్రల్లో కూడా కనిపిస్తానని అంటోంది. చక్కటి కథ, ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికితే తాను ఎప్పుడూ రెడీ అని చెబుతోంది. కుదిరితే హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేయొచ్చు అని హింట్ ఇచ్చింది.

కాబోయే వాడు ఎలా ఉండాలంటే…

ప్రియుడి విషయంలో తనకంటూ ఎలాంటి ఆశలు లేవని చెప్పింది. సరైనోడు దొరికితే ఖచ్చితంగా లవ్ చేసి మరీ.. పెళ్లి చేసుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అందం, డబ్బుతో తనకు పనిలేదని.. కాస్త తెలివైన వాడు భర్తగా రావాలని ఆమె కోరుకుంటోంది.

ప్రస్తుతం పలు ప్లాప్స్‌తో కెరీర్ కొంచెం స్లోగా ఉన్నా.. బిజినెస్ రంగంలో మాత్రం రకుల్ దూసుకుపోతోందని చెప్పాలి. అంతేకాక ఇటీవల తన తమ్ముడ్ని కూడా హీరోగా లాంచ్ చేసింది. నటిగా, బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్‌కు టీవీ9 తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.