అమెజాన్ ప్రైమ్‌లోకి ‘సాహో’ వచ్చేస్తోంది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. ఈ మూవీ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ రీత్యా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సోసోగా వచ్చాయి. దీంతో కొంతమేరకు నిర్మాతలు లాభపడ్డారు గానీ డిస్టిబ్యూటర్లు మాత్రం నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ‘సాహో’ […]

అమెజాన్ ప్రైమ్‌లోకి 'సాహో' వచ్చేస్తోంది!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 11, 2019 | 6:14 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. ఈ మూవీ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ రీత్యా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సోసోగా వచ్చాయి. దీంతో కొంతమేరకు నిర్మాతలు లాభపడ్డారు గానీ డిస్టిబ్యూటర్లు మాత్రం నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ‘సాహో’ ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో నిర్మాతలకు ఉన్న ఒప్పందం ప్రకారం.. సినిమా విడుదలైన 60 రోజుల తర్వాత ఆన్లైన్‌లోకి అందుబాటులోకి రావాలి. ఇదే కోవలో అక్టోబర్ 28న ‘సాహో’ అమెజాన్ ప్రైమ్‌లో రానుందట. అయితే ఆ డేట్ కంటే ముందుగా ప్రభాస్ పుట్టినరోజు నాడు అనగా అక్టోబర్ 23న ‘సాహో’ హిందీ వెర్షన్.. ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులకు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘సాహో’కు ప్రైమ్‌లో కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుందనే చెప్పాలి.