AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube: భారత్‌లో యూట్యూబర్లకు షాక్‌.. 29 లక్షల వీడియోలు, 48 లక్షల ఛానెళ్ల తొలగింపు

Youtube: యూట్యూబ్‌.. దీని గురించి తెలియని వారంటూ ఉండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యూట్యూబ్‌ వాడంది ఉండరు. తాజాగా భారతదేశంలో యూట్యూబ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. 29 లక్షల వీడియోలు, 48 లక్షల ఛానెళ్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటో తెలుసా..?

Youtube: భారత్‌లో యూట్యూబర్లకు షాక్‌.. 29 లక్షల వీడియోలు, 48 లక్షల ఛానెళ్ల తొలగింపు
Subhash Goud
|

Updated on: Mar 09, 2025 | 11:37 AM

Share

వీడియో కంటెంట్ పాలసీకి సంబంధించి YouTube పెద్ద చర్య తీసుకుంది. యూట్యూబ్‌ దాని ప్లాట్‌ఫామ్ నుండి 9.5 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. కంటెంట్ ఉల్లంఘన కారణంగా Google వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ వీడియోలను తీసివేసింది. అదే సమయంలో అక్టోబర్-డిసెంబర్ 2024 మధ్య యూట్యూబ్‌ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలోని ప్లాట్‌ఫారమ్ నుండి 2.9 మిలియన్లకు పైగా (29 లక్షలు) వీడియోలు తొలగించింది. ఈ కంటెంట్ తమ విధానానికి విరుద్ధమని యూట్యూబ్‌ పేర్కొంది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించబడిన కంటెంట్‌లో ద్వేషపూరిత ప్రసంగం, పుకార్లు, వేధింపులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలను తొలగించడానికి యూట్యూబ్‌ ఏ వ్యవస్థను ఉపయోగించింది?

ఈ వ్యవస్థను ఉపయోగించి యూట్యూబ్‌ మిలియన్ల కొద్దీ వీడియోలను తొలగింపు:

యూట్యూబ్‌ దాని ప్లాట్‌ఫామ్‌ను పారదర్శకంగా ఉంచడానికి AI- ఆధారిత గుర్తింపు వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ యూట్యూబ్‌ మార్గదర్శకాలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలను గుర్తిస్తుంది. తొలగించిన వీడియోలలో ఎక్కువగా పిల్లలను ప్రమాదంలో పడేసే విన్యాసాలు, వేధింపులు వంటి కంటెంట్ ఉన్నట్లు గుర్తిచింది.

లక్షలాది YouTube ఛానెల్‌ల తొలగింపు:

యూట్యూబ్ వీడియోలను తొలగించడమే కాకుండా, దాని ప్లాట్‌ఫామ్ నుండి 4.8 మిలియన్లకు పైగా అంటే 48 లక్షల ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్‌లు స్పామ్ లేదా మోసానికి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాయని యూట్యూబ్‌ చెబుతోంది. ప్రత్యేకత ఏమిటంటే, ఒక ఛానెల్‌ను యూట్యూబ్‌ నుండి తొలగిస్తే, ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన అన్ని వీడియోలు కూడా స్వయంచాలకంగా తొలగించబడతాయి. యూట్యూబ్‌ను పారదర్శకంగా, వినియోగదారులకు సురక్షితంగా ఉంచడానికి ఈ చర్య ఎప్పటికప్పుడు తీసుకుంటామని గూగుల్ వీడియో ప్లాట్‌ఫామ్ తెలిపింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమెను గుర్తుపట్టారా? ఒకప్పుడు రూ.1,200.. ఇప్పుడు రూ.8,352 కోట్లు
ఈమెను గుర్తుపట్టారా? ఒకప్పుడు రూ.1,200.. ఇప్పుడు రూ.8,352 కోట్లు
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. మధ్యాహ్నం కౌంటింగ్..
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. మధ్యాహ్నం కౌంటింగ్..
బంగారం, వెండికి పోటీగా దూసుకొస్తున్న రాగి..!
బంగారం, వెండికి పోటీగా దూసుకొస్తున్న రాగి..!
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు