Sobhita Dhulipala: వావ్.. వావ్.. వావ్…. ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
అక్కినేని నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరో సినిమాపై ప్రశంసలు కురిపించింది.

తెలుగమ్మాయే అయినా తన అందం, అభినయంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది శోభిత ధూళిపాళ్ల. హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో విభిన్నమైన పాత్రలు పోషించి బాగా పాపులర్ అయ్యింది. ఇదే క్రమంలో అక్కినేని అందగాడు నాగ చైతన్యతో ప్రేమలో పడింది. గతేడాది పెద్దల సమక్షంలో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. వివాహం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ అందాల తార మళ్లీ సినిమాలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. గత కొన్ని రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ధురంధర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘వావ్.. వావ్.. వావ్..ఉత్కంఠభరితమైనది. మైండ్ బ్లోయింగ్. స్ఫూర్తిదాయకం. మిగతా వాటిలా కాదు. సుప్రీమ్!! ఆదిత్య, రణ్ వీర్ అదరగొట్టారు.. సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఏం అందం’ అని రాసుకొచ్చింది. చివరిలో తన పోస్టుకు సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పాటు నమస్కారం చేస్తున్న, హార్ట్ సింబల్స్ ఎమోజీలను జోడించింది.
ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల ఇన్ స్టా గ్రామ్ స్టోరీ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ధురంధర్ సినిమా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా గా రికార్డుల కెక్కింది. అంతేకాదు మన దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ 9 స్థానాన్ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమాకు ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ధురంధర్ దాటికి మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోయే అవకాశముంది.
రూ. 1000 కోట్ల క్లబ్ లో ధురంధర్ సినిమా..
A certificate. 3h 35m runtime. Banned in Gulf countries. No Pan India release. Negative Campaign.
Yet, #Dhurandhar crossed ₹1000cr gross 🤯 pic.twitter.com/viS6RXLrgx
— Ayyappan (@Ayyappan_1504) December 26, 2025
#Dhurandhar is now 4th highest-grossing Indian film in North America, beats RRR🔥
Baahubali 2- $22M Kalki 2898 AD- $18.57M Pathaan- $17.49M Dhurandhar- $15.66M (22D)🔥 RRR- $15.34M Pushpa 2- $15.26M Jawan- $15.23M Animal- $15M Dangal- $12.19M Padmaavat- $12.17M pic.twitter.com/uotaolQCkU
— Chiubaba (@Chiubaba1) December 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
