- Telugu News Photo Gallery Cinema photos Do You Know Aishwarya Rajesh Acted Child Artist In Rajendra Prasad Rambantu Movie
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.. ? ఆ టాలీవుడ్ హీరో మూవీలో..
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.. ? ఆ టాలీవుడ్ హీరో మూవీలో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐశ్వర్య రాజేశ్. ఇన్నాళ్లు తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే చిన్నప్పుడే ఐశ్వర్య ఓ తెలుగు సినిమాలో కనిపించిందన్న సంగతి తెలుసా.. ?
Updated on: Mar 09, 2025 | 9:23 AM

ఐశ్వర్య రాజేశ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

అయితే తమిళంలో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ఐశ్వర్య రాజేశ్.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేశ్. ఇందులో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ మనసులు గెలుచుకుంది.

అయితే ఐశ్వర్య రాజేశ్ చిన్నప్పుడే తెలుగులో ఓ సినిమా చేసిందని తెలుసా.. ? నటకిరిటీ రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. తెలుగమ్మాయే అయినా తమిళ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో కనిపించింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.




