HBD Akhil Akkineni: అఖిల్‌కి విషెస్‌ చెప్పిన ప్రముఖులు

HBD Akhil Akkineni: అఖిల్‌కి విషెస్‌ చెప్పిన ప్రముఖులు

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ఇవాళ  26వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 08, 2020 | 3:29 PM

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ఇవాళ  26వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు తమ అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ నుంచి ఓ లుక్ విడుదల చేసింది మూవీ యూనిట్. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఈ చిత్ర విడుదల వాయిదా పడింది.

Read This Story Also: HBD Allu Arjun: స్టైలిష్‌స్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu