సాహోరే ‘బాహుబలి’.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు

‘ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి..  ‘రెబల్‌’స్టార్ బిరుదుతో.. అందరి చేత మా ‘డార్లింగ్’ ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్’ అనిపించుకుంటూ.. తన అందంతో అమ్మాయిలకు ‘మిర్చి’ ఘాటు పుట్టిస్తూ.. కాంట్రవర్సరీలు లేని ‘యోగి’గా.. ‘పౌర్ణమి’ నాటి చంద్రుడిలా.. సింపుల్‌గా ఉంటూ అభిమానులకు ఎప్పటికీ ‘బుజ్జిగాడు’లా.. ఇప్పటికీ బ్రహ్మచారి ‘ఏక్ నిరంజన్‌’లా.. ‘మున్నా’ భాయి నీకిదే […]

సాహోరే 'బాహుబలి'.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2019 | 1:45 PM

‘ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి..  ‘రెబల్‌’స్టార్ బిరుదుతో.. అందరి చేత మా ‘డార్లింగ్’ ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్’ అనిపించుకుంటూ.. తన అందంతో అమ్మాయిలకు ‘మిర్చి’ ఘాటు పుట్టిస్తూ.. కాంట్రవర్సరీలు లేని ‘యోగి’గా.. ‘పౌర్ణమి’ నాటి చంద్రుడిలా.. సింపుల్‌గా ఉంటూ అభిమానులకు ఎప్పటికీ ‘బుజ్జిగాడు’లా.. ఇప్పటికీ బ్రహ్మచారి ‘ఏక్ నిరంజన్‌’లా.. ‘మున్నా’ భాయి నీకిదే మా ‘సాహో’ అంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరును లిఖించుకున్నాడు మన ‘అడవి రాముడు’ ప్రభాస్‌.

పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌కు టాలీవుడ్ ఎంట్రీ ఈజీగానే జరిగినప్పటికీ.. కెరీర్ ప్రారంభంలో అతడికి కూడా ‘సినిమా’ కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటితో ఏ మాత్రం డీలా పడని ప్రభాస్.. విభిన్న కథలను ఎంచుకుంటూ హిట్లను కొట్టి.. టాప్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం కూడా చాలానే ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు మరో చిత్రాన్ని ఒప్పుకోకుండా కేవలం బాహుబలికే సమయాన్ని కేటాయించాడు ప్రభాస్. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఏ స్టార్‌ హీరో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేందుకు సాహసించారు. అందుకే దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రభాస్‌‌కు మరిచిపోలేని హిట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు అసలు ప్రభాస్ లేకుంటే బాహుబలి ఉండేదే కాదంటూ ఆయన కితాబిచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు: 1. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినీ వాతావరణమే ఉన్నప్పటికీ.. పెద్దయ్యాక ఏదైనా వ్యాపారం చేయాలని ప్రభాస్ అనుకున్నాడట. హీరో అవుతానని అనుకోలేదట. 2. ప్రభాస్‌ను ఆయన స్నేహితులు సరదాగా హీరో అని పిలిచేవారట 3. విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్‌ కోసం విశ్వామిత్రుడి పాత్రలో ప్రభాస్ నటించాడు. 4. థాయిలాండ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మను ఉంచారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్. 5. ప్రభాస్ మొదటిసారి గెస్ట్‌ రోల్‌లో కనిపించిన చిత్రం యాక్షన్‌ జాక్సన్. ఇందులో ఓ పాటలో ప్రభాస్ కనిపిస్తాడు. 6. ప్రభాస్‌కు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. 7.హిందీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ అంటే ప్రభాస్‌కు గౌరవం.

కాగా ఇవాళ ప్రభాస్ 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆయన కెరీర్ ఇకపై కూడా అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. టీవీ9 తెలుగు తరఫున హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్