అక్కడ ధనుష్.. ఇక్కడ చరణ్.. హిట్ కొట్టేనా..?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్‌కు మంచి హిట్ ఇస్తుందని టాక్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీలో ఒకరైన రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం హిట్‌తో […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:00 pm, Wed, 23 October 19
అక్కడ ధనుష్.. ఇక్కడ చరణ్.. హిట్ కొట్టేనా..?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్‌కు మంచి హిట్ ఇస్తుందని టాక్ నడుస్తోంది.

మెగా ఫ్యామిలీలో ఒకరైన రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం హిట్‌తో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలోని చరణ్ క్యారెక్టర్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎప్పుడు చరణ్ అలాంటి సినిమా చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది (2020 జూలై 30)న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా తర్వాత.. తండ్రి చిరంజీవితో ఒక మల్టీస్టారర్ మూవీ చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు రీసెంట్‌గా తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీని కూడా తెలుగులో రీమేక్ చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే రామ్ చరణ్.. జంజీర్, ధృవ వంటి రీమేక్ సినిమాల్లో నటించి సక్సస్ అందుకున్నాడు. మరి ఈ సినిమాకు కూడా చరణ్ ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.