AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్లలో “తుపాకి” పేలుతుందా..?

ఈనెల 25న విడుదల కానున్న తుపాకి రాముడు సినిమాకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. కళలపై రసమయికి ఉన్న మక్కువతో తుపాకి రాముడు సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు థియేటర్స్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదు. తుపాకి రాముడు విడుదలకు థియేటర్స్ ఇస్తే ఊరుకునేది లేదని తెలంగాణ నేతలు డిస్ట్రిబ్యూటర్స్ పై బెదిరింపులకు […]

థియేటర్లలో తుపాకి పేలుతుందా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 23, 2019 | 1:02 PM

Share

ఈనెల 25న విడుదల కానున్న తుపాకి రాముడు సినిమాకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. కళలపై రసమయికి ఉన్న మక్కువతో తుపాకి రాముడు సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు థియేటర్స్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదు. తుపాకి రాముడు విడుదలకు థియేటర్స్ ఇస్తే ఊరుకునేది లేదని తెలంగాణ నేతలు డిస్ట్రిబ్యూటర్స్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారు.

కాగా, ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వాలని సినీబృందం.. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కోరింది. అయితే తెలంగాణలో థియేటర్స్ దొరికినా.. ఏపీలో మాత్రం కష్టమేనని నిర్మాతలు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందరూ తెలంగాణకు చెందిన వారే కావడం ఓ కారణం అవుతుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ కళలు, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ గురించి తీసిన సందేశాత్మక చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇక ఎప్పుడూ నవ్వులు కురిపించే బెత్తిరి సత్తి.. ఈ సినిమాలో ఏడిపిస్తాడని చిత్ర బృందం చెబుతోంది. మరి ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రేక్షకులను తుపాకి రాముడు ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Follow Us
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..