‘ఇండియన్ 2’ పోస్టర్.. ‘సేనాపతి’ ఏం ఆలోచిస్తున్నాడు..!

లోక నాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇవాళ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఇండియన్ 2’ నుంచి ప్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఓ ఫోర్ట్‌ మీద నిల్చున్న కమల్.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ లుక్‌పై ”అవినీతిపరుల ఆటకట్టించేందుకు ఏం చేయాలో సేనాపతి ఆలోచిస్తున్నాడని” […]

'ఇండియన్ 2' పోస్టర్.. 'సేనాపతి' ఏం ఆలోచిస్తున్నాడు..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 07, 2019 | 5:58 PM

లోక నాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇవాళ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఇండియన్ 2’ నుంచి ప్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఓ ఫోర్ట్‌ మీద నిల్చున్న కమల్.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ లుక్‌పై ”అవినీతిపరుల ఆటకట్టించేందుకు ఏం చేయాలో సేనాపతి ఆలోచిస్తున్నాడని” కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా 1996లో వచ్చిన ఇండియన్(తెలుగులో భారతీయుడు)సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రకుల్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అనిరుథ్ సంగీతం అందిస్తోన్న ఇండియన్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu