ఫ్లయింగ్ కిస్సులు.. పచ్చి టాస్కులు.. రెచ్చిపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు!
హిందీ బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. విచిత్రమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ఫ్యాన్స్‌ను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా హౌస్‌లో ఉన్న నటుడు సిద్ధార్థ్ శుక్లాకు బయట రెస్పాన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇకపోతే యుద్దభూమిలా తలపిస్తున్న హౌస్‌లో లవ్ స్టోరీ మొదలైనట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ మధ్య అఫైర్ నడుస్తున్నట్లు సమాచారం. షెహనాజ్ పలుమార్లు సిద్ధార్థ్ అంటే తనకు ఇష్టమని.. అతనితో ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ […]
హిందీ బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. విచిత్రమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ఫ్యాన్స్‌ను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా హౌస్‌లో ఉన్న నటుడు సిద్ధార్థ్ శుక్లాకు బయట రెస్పాన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇకపోతే యుద్దభూమిలా తలపిస్తున్న హౌస్‌లో లవ్ స్టోరీ మొదలైనట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ మధ్య అఫైర్ నడుస్తున్నట్లు సమాచారం. షెహనాజ్ పలుమార్లు సిద్ధార్థ్ అంటే తనకు ఇష్టమని.. అతనితో ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటోందని చెప్పకనే చెప్పింది. అయితే రీసెంట్‌గా ఈ జంట రచ్చ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తూ.. ఇష్టాన్ని బహిర్గతం చేశారని చెప్పొచ్చు.
ఇకపోతే సిద్ధార్థ్ ప్రస్తుతం రెండు వారాల పాటు సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్క్‌లో నటి మహీరా శర్మతో దురుసుగా ప్రవర్తించడంతో ఎలిమినేషన్స్‌కు సెల్ఫ్ నామినేట్ చేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్‌తో సాగుతున్న ఈ బిగ్ బాస్‌లో ఫైనల్స్‌కు సిద్ధార్థ్ శుక్లా చేరడం ఖచ్చితంగా జరుగుతుంది. మున్ముందు ఎలాంటి సస్పెన్స్ ఉంటుందో వేచి చూద్దాం.