AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌లో టిక్ టాక్ సెన్సేషన్.. ఎంట్రీతోనే సంచలనం!

హిందీ బిగ్ బాస్ రోజుకో సస్పెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌కి ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నారు. బుల్లితెర, బీ-టౌన్ నుంచి ప్రముఖ సెలబ్రిటీస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలై దాదాపు 6 వారాలు పూర్తి కావడంతో పలువురు ఎలిమినేషన్ అయ్యారు. దీంతో సల్లూ భాయ్ మరికొందరిని హౌస్‌‌లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించాడు. వారిలో రీసెంట్‌గా వెళ్లిన నటుడు వికాస్ జయరాం పథక్ […]

బిగ్ బాస్‌లో టిక్ టాక్ సెన్సేషన్.. ఎంట్రీతోనే సంచలనం!
Ravi Kiran
|

Updated on: Nov 08, 2019 | 5:19 PM

Share

హిందీ బిగ్ బాస్ రోజుకో సస్పెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌కి ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నారు. బుల్లితెర, బీ-టౌన్ నుంచి ప్రముఖ సెలబ్రిటీస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలై దాదాపు 6 వారాలు పూర్తి కావడంతో పలువురు ఎలిమినేషన్ అయ్యారు. దీంతో సల్లూ భాయ్ మరికొందరిని హౌస్‌‌లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించాడు. వారిలో రీసెంట్‌గా వెళ్లిన నటుడు వికాస్ జయరాం పథక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

యూట్యూబ్, టిక్ టాక్‌లో ఫేమస్ అయిన వికాస్ పథక్‌ను ‘హిందూస్తాన్ బహు’ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. టిక్ టాక్‌లో సుమారు 6 లక్షల ఫాలోవర్స్ ఉండగా.. యూట్యూబ్‌లో 1.8 మిలియన్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇకపోతే వికాస్‌కు సంజయ్ దత్ అంటే అమితమైన ఇష్టం. రీల్ మున్నా భాయ్ మాదిరిగా డ్రెస్ చేసుకుంటూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాడు. ఇదిలా ఉండగా వికాస్ అనుకోకుండా  చేసిన ఒక అభ్యంతరకరమైన వీడియో వల్ల సోషల్ మీడియాలో తెగ పాపులర్ కావడమే కాకుండా దానిపై మెమెస్ కూడా వైరల్ అయ్యాయి. ముంబైలో కుటుంబసమేతంగా నివసిస్తున్న వికాస్.. మధ్యతరగతికి చెందినవాడు. రకరకాల చిరుద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు ఛట్రం కొనసాగిస్తున్న అతడికి.. బిగ్ బాస్ నుంచి పిలుపురావడం కెరీర్‌కే ప్లస్ పాయింట్ అని చెప్పాలి.  కామన్ పర్సన్స్‌ను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ చేయడంతో.. వారిలో ప్రతిభను వెలికితీసినట్లు అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే  తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లలోనూ యూట్యూబ్ సెన్సేషన్స్ దీప్తి సునైనా, మహేష్ విట్టా, ఆషు రెడ్డి హౌస్‌లో వచ్చి హంగామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్, దీప్తి, జాఫర్ వంటి జర్నలిస్ట్స్‌ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత