మళ్లీ పవన్ ఫార్ములాను తీసుకున్న నితిన్.. హిట్ గ్యారెంటీనా..!
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న డైహార్ట్ అభిమానుల్లో నితిన్ ఒకడు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్బాల్లో వెల్లడించాడు. అంతేకాదు ‘ఇష్క్’ తరువాత తాను నటించిన కొన్ని సినిమాల్లో పవన్‌ను అనుకరించాడు నితిన్. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రంలోనూ పవన్ ఫార్ములానే వాడుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఈ హీరో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు […]
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న డైహార్ట్ అభిమానుల్లో నితిన్ ఒకడు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్బాల్లో వెల్లడించాడు. అంతేకాదు ‘ఇష్క్’ తరువాత తాను నటించిన కొన్ని సినిమాల్లో పవన్‌ను అనుకరించాడు నితిన్. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రంలోనూ పవన్ ఫార్ములానే వాడుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఈ హీరో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
”అందులో నా లవ్ కూడా విజయ మాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం” అంటూ నితిన్ చెప్పగా.. టీజర్ మొత్తం హీరోయిన్ రష్మిక నడుమును పట్టుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్లుగా చూపించారు. కాగా నడుము సీన్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ’ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇదే ఫార్ములాను నితిన్.. తాను నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కూడా వాడాడు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం కోసం వాడుతున్నాడు. మరి ‘గుండెజారిలా’ ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా.. మహితి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అఆ’ తరువాత హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో కాస్త వెనకబడ్డ నితిన్.. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.