మారిపోయిన అఖిల్.. అందుకే సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాడా..!

అక్కినేని వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ను ఇంతవరకు సక్సెస్ వరించలేదు. వరసగా మూడు హ్యాట్రిక్ ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్న అఖిల్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే జూలైలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. ఇంతవరకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:16 pm, Thu, 7 November 19
మారిపోయిన అఖిల్.. అందుకే సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాడా..!

అక్కినేని వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ను ఇంతవరకు సక్సెస్ వరించలేదు. వరసగా మూడు హ్యాట్రిక్ ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్న అఖిల్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అయితే జూలైలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. ఇంతవరకు దీనిపై ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. ఫస్ట్‌లుక్, ఫెస్టివల్ పోస్టర్, టైటిల్‌ ఇలా ఏ అప్‌డేట్‌ను కూడా మూవీ యూనిట్ విడుదల చేయలేదు. దీంతో సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందనేది కూడా అందరిలో అనుమానంగా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతోంది. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు ఒక సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. ఇక ఈ పాటకు న్యూయార్క్‌కు చెందిన అరిక్ అనే కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం. ఇక ఈ వారంలో ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌కు రానుందని సమాచారం.

కాగా ముందు సినిమాల విషయంలో చూపించిన ఉత్సాహాన్ని అఖిల్ ఈ మూవీ కోసం చూపించట్లేదు. ఆ సినిమాలకు మొదట భారీ హైప్‌ను క్రియేట్ చేయగా.. అవి ఫ్లాప్‌లుగా మిగిలాయి. ఇక ఇప్పుడు అలా కాకూడని అఖిల్ భావిస్తున్నాడట. అందుకే హడావిడి లేకుండా సైలెంట్‌గా మూవీ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విజయం అటు అఖిల్, ఇటు బొమ్మరిల్లు భాస్కర్.. ఇద్దరికీ అవసరం. దీంతో దీనిపై ఈ ఇద్దరు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.