AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్, బన్నీ సీక్రెట్ మీటింగ్.. మారిన రిలీజ్ డేట్స్..?

రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టాప్ హీరోలైన మహేష్, బన్నీ పోరుకు సిద్ధమయ్యారు. మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’.. బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలు రెండూ జనవరి 12న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉండబోతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ విషయంలో ఈ ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. ఒకే రోజు కాకుండా రెండు వేర్వేరు తేదీల్లో వచ్చేందుకు వీరు అంగీకరించారట. […]

మహేష్, బన్నీ సీక్రెట్ మీటింగ్.. మారిన రిలీజ్ డేట్స్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 07, 2019 | 8:42 PM

Share

రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టాప్ హీరోలైన మహేష్, బన్నీ పోరుకు సిద్ధమయ్యారు. మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’.. బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలు రెండూ జనవరి 12న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉండబోతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ విషయంలో ఈ ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. ఒకే రోజు కాకుండా రెండు వేర్వేరు తేదీల్లో వచ్చేందుకు వీరు అంగీకరించారట. ఈ మేరకు సీక్రెట్‌గా మీట్ అయిన ఈ ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

అయితే మొదట సంక్రాంతికి విడుదల తేదీని మహేష్ బాబు ఫిక్స్ చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రారంభమైన రోజే వచ్చే సంక్రాంతికి మూవీ రానుందని అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇక ఆ తరువాత బన్నీ టీమ్ తమ విడుదల తేదీని ప్రకటించింది. దీంతో అప్పటినుంచే ఈ రెండు సినిమాల మధ్య పోరు మొదలైంది. కాగా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని ఇరు మూవీల నిర్మాతలు ఎప్పుడో భావించారట. లేకపోతే కలెక్షన్లపై భారీ ప్రభావం ఉంటుందని వారు అనుకున్నారట. కానీ ఈ విషయంపై మహేష్, బన్నీలు మాత్రం వెనక్కి తగ్గలేదట. ఆ రోజు ఎలాగైనా రావాల్సిందేనని పట్టు పట్టారట. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగి ఇద్దరిని బుజ్జగించడంతో.. సీక్రెట్‌గా మీట్ అయిన మహేష్, బన్నీలు రిలీజ్ డేట్‌లపై కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఒక సినిమాను 11న, మరో సినిమాను 13న రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎవరి సినిమా ముందు వస్తుందో చూడాలి.

కాగా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేష్ సరసన రష్మిక నటించింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలోకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత