మహేష్ ఫ్యాన్స్‌కు ఝలక్.. షాకింగ్ న్యూస్ చెప్పిన నమ్రత
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఆయన భార్య నమ్రత షాకింగ్ న్యూస్ తెలిపింది. మహేష్ బాబు లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించింది. ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపింది. వరుస సినిమాలతో మహేష్ బాబు బిజీ బిజీగా గడుపుతూ.. ఫ్యామిలీకి సరిగ్గా సమయాన్ని కేటాయించలేక పోతున్నారని ఆమె తెలిపింది. చిన్న చిన్న విహారయాత్రలకు మాత్రమే వెళ్తున్నామని.. కానీ ఈ సారి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నామని నమ్రతా పేర్కొంది. ఆమె మాటల ప్రకారం […]

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఆయన భార్య నమ్రత షాకింగ్ న్యూస్ తెలిపింది. మహేష్ బాబు లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించింది. ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపింది. వరుస సినిమాలతో మహేష్ బాబు బిజీ బిజీగా గడుపుతూ.. ఫ్యామిలీకి సరిగ్గా సమయాన్ని కేటాయించలేక పోతున్నారని ఆమె తెలిపింది. చిన్న చిన్న విహారయాత్రలకు మాత్రమే వెళ్తున్నామని.. కానీ ఈ సారి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నామని నమ్రతా పేర్కొంది. ఆమె మాటల ప్రకారం దాదాపు మూడు నెలల ప్రకారం మహేష్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అయితే మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరులో నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలైన పది రోజుల తరువాత ఫ్యామిలీతో కలిసి మహేష్ ఫారిన్ టూర్‌కు వెళ్లనున్నట్లు టాక్. దీంతో మహేష్ అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. కాగా మహేష్ తదుపరి చిత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చినా.. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ కాంబోలో మూవీ ఇంకా సెట్ కానట్లు సమాచారం. మరోవైపు సురేందర్ రెడ్డి కూడా మహేష్‌తో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



