‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం రాశిఖన్నా ఫస్ట్‌టైం ఏం చేసిందంటే..!

టాలీవుడ్‌లో.. యంగ్ హీరో విజయ్ దేవర కొండకు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్‌కు పండగే. తాజాగా విజయ్ చేస్తోన్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. టైటిల్‌తోనే.. బాగా క్రేజ్ తెచ్చుకున్న.. ఈ సినిమా పోస్టర్‌ అయితే.. బీభత్సంగా ఉంది. విడుదలైన కొద్ది క్షణాల్లో.. బాగా వైరల్ అయ్యింది. కాగా.. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. రాశీఖన్నా మెయిన్ హీరోయిన్‌ కాగా.. కేథరిన్, […]

'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం రాశిఖన్నా ఫస్ట్‌టైం ఏం చేసిందంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 1:40 PM

టాలీవుడ్‌లో.. యంగ్ హీరో విజయ్ దేవర కొండకు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్‌కు పండగే. తాజాగా విజయ్ చేస్తోన్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. టైటిల్‌తోనే.. బాగా క్రేజ్ తెచ్చుకున్న.. ఈ సినిమా పోస్టర్‌ అయితే.. బీభత్సంగా ఉంది. విడుదలైన కొద్ది క్షణాల్లో.. బాగా వైరల్ అయ్యింది. కాగా.. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. రాశీఖన్నా మెయిన్ హీరోయిన్‌ కాగా.. కేథరిన్, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లాతో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. తాజాగా.. ఈ సినిమాకి రాశి ఖన్నా డబ్బింగ్ చెప్పింది.

‘నేను ఇప్పటిదాకా ఒక్క సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పలేదు. నేను డబ్బింగ్ చెప్తోన్న మొదటి సినిమా ఇది. ఉచ్చరణ, నా వాయిస్ పాత్రకు నప్పుతాయో లేదోననే భయం ఉండేది. కానీ.. డబ్బింగ్ పూర్తి అయిన తరువాత నేనే నమ్మలేకపోయాను. మీరు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురుచూస్తోన్నా’ అంటూ రాశి ట్వీట్ చేసింది. కాగా.. రాశి ఖన్నా టాలీవుడ్‌కి వచ్చి ఐదేళ్లయినా.. ఇప్పటికి ఒక్క సినిమాకి కూడా ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పలేదు. ‘జోరు’ సినిమాలో మాత్రం ఓ పాట పాడింది. అయితే.. ఈ సినిమాకు రాశిఖన్నా డబ్బింగ్‌ చెప్పిందట. దానికి సంబంధించిన ఓ పిక్‌ను ఆమెనే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.