Sankranthiki Vasthunnam : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్.. వెంకీమామ దెబ్బకు రికార్డులు బ్రేక్..
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ సాంగ్ మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పాట వినిపిస్తుంది. “గోదారి గట్టు మీద రామ సిలకవే” సాగే ఈ పాట అటు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ మెలోడిని రమణ గోగుల, మధుప్రియ పాడారు. ఇక భాస్కర భట్ల ఈ పాటను అద్భుతంగా రాశారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పుడు ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ పాటకు అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత వెంకీకి రమణ గోగుల పాట పాడడం.. అది కూడా మెలోడీ కావడంతో నెటిజన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.
వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఉన్న అందమైన కెమిస్ట్రీని చూపించే ఈ పాట విజువల్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కేవలం 3 వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించిన వేగవంతమైన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇన్ స్టా రీల్స్ లో తెగ ట్రెండ్ అవుతుంది. చిన్న, పెద్ద ఈ పాటకు తమదైన స్టైల్లో స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు డిసెంబర్ 30న విడుదల కానున్న మూడో పాటపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ పాటను స్వయంగా వెంకటేశ్ పాడడం విశేషం.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన లేటేస్ట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షిచౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.