AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: సమ్మతమే నుంచి మొదటి లిరికల్‌ సాంగ్‌ .. అలరిస్తోన్న కిరణ్‌, చాందినీల రొమాంటిక్‌ ట్రాక్‌..

కిరణ్‌ అబ్బవరం.. టాలీవుడ్‌లో ఇప్పటివరకు రెండు సినిమాల్లో మాత్రమే నటించాడీ యంగ్‌ హీరో

Kiran Abbavaram: సమ్మతమే నుంచి మొదటి లిరికల్‌ సాంగ్‌ .. అలరిస్తోన్న కిరణ్‌, చాందినీల రొమాంటిక్‌ ట్రాక్‌..
Basha Shek
|

Updated on: Nov 29, 2021 | 12:39 PM

Share

కిరణ్‌ అబ్బవరం.. టాలీవుడ్‌లో ఇప్పటివరకు రెండు సినిమాల్లో మాత్రమే నటించాడీ యంగ్‌ హీరో. అయితేనేం యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’ సినిమాలో తన ఎనర్జిటిక్‌ ఫర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం అతను ‘సమ్మతమే’ అనే సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు. ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్బన్‌ లవ్‌స్టోరీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘కృష్ణ అండ్ సత్యభామ’ అంటూ సాగే సింగిల్‌ లిరికిల్‌ వీడియో సాంగ్‌నువిడుదల చేశారు మూవీ మేకర్స్‌.

కాగా ఈ పాటలో కిరణ్‌, చాందినీల జంట చూడముచ్చటగా అనిపిస్తోంది. వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక శేఖర్‌ చంద్ర బాణీలు, కృష్ణకాంత్ సాహిత్యానికి యాజీన్‌ నజీర్‌, శిరీషా భాగవతుల గొంతు కలవడంతో పాట అద్భుతంగా వచ్చింది. ‘ మెలోడీ సాంగ్‌ అద్భుతంగా ఉంది. లిరిక్స్‌ బాగున్నాయి’ అంటూ యూట్యూబ్‌లో కామెంట్ల వర్షం కురుస్తోంది. కాగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.Also Read:

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. బ్యాన్ చేయాలంటూ రాజా సింగ్ డిమాండ్..

Twinkle Khanna: అందుకే ఆ సమయంలో అమ్మకు కూలీగా మారాను.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ట్వింకిల్‌ ఖన్నా..

vijay devarakonda upcoming movie: విజయ్‌ దేవరకొండకు మరో క్రేజీ సినిమా ఛాన్స్‌… డైరెక్టర్ ఎవరో తెలుసా..?(వీడియో)