AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twinkle Khanna: అందుకే ఆ సమయంలో అమ్మకు కూలీగా మారాను.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ట్వింకిల్‌ ఖన్నా..

ట్వింకిల్‌ ఖన్నా.. హిందీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. వెంకటేశ్‌ హీరోగా నటించిన 'శీను' సినిమాలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిలైపోయింది.

Twinkle Khanna: అందుకే ఆ సమయంలో అమ్మకు కూలీగా మారాను.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ట్వింకిల్‌ ఖన్నా..
Basha Shek
|

Updated on: Nov 29, 2021 | 12:11 PM

Share

ట్వింకిల్‌ ఖన్నా.. హిందీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘శీను’ సినిమాలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిలైపోయింది. పెళ్లయ్యాక సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న ఆమె.. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తన పిల్లల ఫొటోలు, వీడియోలతో పాటు అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందులో పంచుకుంటోంది. అలా తాజాగా ఇన్‌స్టాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార. అందులో ఒక పుస్తకం ఫొటోను పంచుకున్న ఆమె.. ‘ఈ పుస్తకం పేరు ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా’.. ప్రముఖ సినీ విమర్శకురాలు, సంపాదకురాలు భావన సొమయ్య ఈ పుస్తకాన్ని రాసింది. నా సినిమా జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు అమ్మ (డింపుల్ కపాడియా)కు, నాకు మధ్య జరిగిన కొన్ని సరదా సంఘటనలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను ఈ పుస్తకం తిరిగిచ్చింది’ అని చెప్పుకొచ్చింది.

కాగా ఈ పోస్టుపై స్పందించిన రచయిత్రి భావన ‘ 1994లో ట్వింకిల్‌తో పాటు ఆమె తల్లి డింపుల్ కపాడియాను ముంబై విమానాశ్రయంలో కలిశాను. వారు తమ ప్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయంలో ట్వింకిల్ తన భుజాల మీద లగేజీని మోస్తూ ఉండగా, తల్లి డింపుల్‌ మాత్రం కుర్చీలో కూర్చొని ఉంది. అప్పుడు నవ్వు ఎందుకు బరువులు మోస్తున్నావు అని ట్వింకిల్‌ను అడగ్గా.. ‘ మా అమ్మకు చెకింగ్ బ్యాగులంటే ఇష్టం ఉండదు. విమానం ల్యాండ్ అయిన తర్వా ఎక్కువగా ఎదురు చూడడం ఆమెకు నచ్చదు. అందువల్ల భారీ బరువులను మోస్తూ నేను కూలీగా మారాల్సి వచ్చింది’ అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత ‘ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ వచ్చిన తర్వాత నీకు స్వాతంత్ర్యం పోతుంది. నువ్వు నటివైతే నీ చుట్టూ బాడీగార్డులు ఉంటారు ‘ అని చెబితే ‘భవిష్యత్తు గురించి నాకు తెలియదు. ప్రస్తుతం నా తల్లికి నేను కూలీగా మారాను’ అని సమాధానమిచ్చిందని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది రచయిత్రి. కాగా పలు బాలీవుడ్‌ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ట్వింకిల్‌ 2001లో అక్షయ్‌ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. ప్రస్తుతం వారి అలనాపాలనలోనే బిజీగా ఉంటోంది.

Also Read:

vijay devarakonda upcoming movie: విజయ్‌ దేవరకొండకు మరో క్రేజీ సినిమా ఛాన్స్‌… డైరెక్టర్ ఎవరో తెలుసా..?(వీడియో)

Sreeleela: పరీక్షలకు వేళాయెరా.. శ్రద్దగా చదువుకుంటున్న ముద్దుగుమ్మ శ్రీలీల..

Radhe Shyam : “రాధేశ్యామ్‌”లో ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట..

Follow Us
లైఫ్ మన కంట్రోల్‏లో ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు..
లైఫ్ మన కంట్రోల్‏లో ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు..
కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్
కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి