Radhe Shyam : “రాధేశ్యామ్‌”లో ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట..

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam : రాధేశ్యామ్‌లో ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట..
Radheshyam
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2021 | 11:26 AM

Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమ‌క‌థ అని మెష‌న్ పోస్ట‌ర్ తోనే రివీల్ అయ్యింది. మొనీమధ్య విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగింది. ఇక రీసెంట్ గా సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది.

ఇక ఈ సినిమానుంచి నేడు మారో పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమా 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. ఇక ఈ సినిమాను ఇటీవలే తన స్నేహితులతో కలిసి చూశారట ప్రభాస్. సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. అలాగే ఓ ప్రధాన ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను సీట్  అంచున కూర్చునేలా చేస్తుందని అంటున్నారు. మరి అది ఏదైనా లవ్ సన్నివేశం లేక యాక్షన్ ఎపిసోడ్ లాంటిందా అన్నది తెలియాల్సి  ఉంది. మొత్తమీద ఇంతకాలం ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులను ఈ సినిమా నిరాశపరచదని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shiva Shankar Master Deth: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..

Bimbisara: త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం “బింబిసారా”.. టీజర్ అదుర్స్..

Choreographer Shiva Shankar Passes Away: కరోనా కాటుకు కొరియోగ్రాఫర్ బలి.. శివ శంకర్ మాస్టర్ సినీ ప్రపంచంలో విషాదం.. (వీడియో)

వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్