Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Vishal: ఎఫ్‌ఐఆర్‌ సినిమాపై అక్కడ నిషేధం.. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన హీరో..

కోలీవుడ్ ట్యాలెంటెడ్‌ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) మొదటిసారి నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం'ఎఫ్ఐఆర్' (FIR). ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వ‌హించారు.

Vishnu Vishal: ఎఫ్‌ఐఆర్‌ సినిమాపై అక్కడ నిషేధం.. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన హీరో..
Vishnu Vishal
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2022 | 12:16 PM

కోలీవుడ్ ట్యాలెంటెడ్‌ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) మొదటిసారి నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం’ఎఫ్ఐఆర్’ (FIR). ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో నేడు (ఫిబ్రవరి11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ (RaviTeja) సమర్పణలో అభిషేక్ పిక్చర్స్‌ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పుడిప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. కువైట్, మలేషియా, ఖతార్ లలో ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందులో నిషేధానికి కారణం చెప్పకపోయినప్పటికీ సినిమాలోని డార్క్‌ కంటెంటే నిషేధానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

‘ఎఫ్ఐఆర్’ సినిమాలో విష్ణు విశాల్‌తో పాటు మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు విశాల్ మోస్ట్ ముస్లిం యువకుడిగా నటించగా.. డైరెక్టర్‌ గౌతమ్ మీనన్ పోలీసు అధికారిగా నటించారు. అయితే ఆయా దేశాల్లోని స్థానిక సెన్సార్‌లను క్లియర్ చేయడంలో ఎఫ్‌ఐఆర్‌ చిత్రబృందం విఫలమైనట్లు కనిపిస్తోంది. అందుకే బ్యాన్‌ చేసినట్లు సమాచారం. కాగా తన సినిమాపై నిషేధం విధించడంతో కువైట్, మలేషియా, ఖతార్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు విష్ణు విశాల్‌.

Also Read:Tollywood Drugs Cases: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడుగా ఈడీ.. మరో కీలక పరిణామం

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..

Andhra Pradesh: విద్యార్థినులను వేధించవద్దన్నందుకు.. ప్రిన్సిపాల్‌ను వెంటపడి కొట్టిన స్టూడెంట్స్

ఐఫోన్ల తయారీ విషయంలో దూసుకుపోతున్న భారత్...
ఐఫోన్ల తయారీ విషయంలో దూసుకుపోతున్న భారత్...
మూడు గ్రహాలకు బలం.. ఏప్రిల్, మే నెలల్లో ఆ రాశులకు అన్ని శుభాలే..!
మూడు గ్రహాలకు బలం.. ఏప్రిల్, మే నెలల్లో ఆ రాశులకు అన్ని శుభాలే..!
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది
షుగర్ షేషెంట్లు తేనె తీసుకోవచ్చా..నిపుణులు ఏం చెబుతున్నారంటే...
షుగర్ షేషెంట్లు తేనె తీసుకోవచ్చా..నిపుణులు ఏం చెబుతున్నారంటే...
లేటెస్ట్ హిట్‌తో ఫుల్ జోష్‌లో యంగ్ బ్యూటీ..
లేటెస్ట్ హిట్‌తో ఫుల్ జోష్‌లో యంగ్ బ్యూటీ..
పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మృణాళిని రవి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
మృణాళిని రవి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు..!
ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు..!
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?