Toofaan Movie: ప్రొఫెషనల్ బాక్సర్లతో తలపడనున్న ఫర్హాన్ అక్తర్.. ‘తుఫాన్’ కోసం సహజ సిద్ధమైన స్టంట్స్..
Toofaan Movie: ఫర్హాన్ అక్తర్ హీరోగా తుఫాన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే.. ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీని డైరెక్టర్ చేసిన ఓం ప్రకాశ్ మెహ్రా.. ఈ స్పోర్ట్స్
Toofaan Movie: ఫర్హాన్ అక్తర్ హీరోగా తుఫాన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే.. ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీని డైరెక్టర్ చేసిన ఓం ప్రకాశ్ మెహ్రా.. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించారు. బాక్సింగ్ రింగ్‌లో పర్ఫార్మ్ చేస్తున్న ఫర్హాన్ ఇంటెన్స్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ రియల్‌గా చేశారు. ఫర్హాన్ ఆక్తర్ ‘తుపాన్’ చిత్రంలో ప్రొఫెషనల్ బాక్సర్లతో తలపడ్డాడు. ఇందు కోసం హరియాణా, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన బాక్సర్లుతో పాటు ఒక విదేశీ బాక్సర్‌ను కూడా సినిమాలో నటింపజేశారు. ఆ విదేశీ బాక్సర్‌తోనే క్లైమాక్స్ ఫైట్ ఉంటుందని చిత్రబృందం తెలిపింది.
టీజర్ చూస్తుంటే ప్రారంభంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించిన ఫర్హాన్.. ఆ తర్వాత బాక్సర్‌గా మారినట్టు తెలుస్తోంది. ‘అజ్జు.. ఓ గ్యాంగ్‌స్టర్, అజీజ్ అలీ.. ఓ బాక్సర్.. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో చాయిస్ నీదే’ అని హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఫర్హాన్‌తో చెబుతున్న మాటలు చూస్తుంటే.. తను హీరోను గైడ్ చేసే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వీధిరౌడీ అనేక పరిణామాల మధ్య చివరకు ఎలా జాతీయస్థాయి బాక్సర్ కాగలిగాడనేది చిత్ర కథాంశం. పరేశ్‌రావల్, మృనాల్ ఠాకూర్, సుప్రియా పాథక్ కపూర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మే 21న నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఫర్హాన్ మేకోవర్ చూస్తే ఫిదా కావలసిందే.