ఎంగేజ్‌మెంట్ ఫొటో షేర్ చేసిన గౌతమ్.. కాజల్ రిప్లై
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ముంబయికి చెందిన ప్రముఖ బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.
Kajal Aggarwal Marriage: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ముంబయికి చెందిన ప్రముఖ బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న తమ వివాహం జరగబోతున్నట్లు కాజల్ అధికారిక ప్రకటనను ఇచ్చింది. ఇక కాజల్‌కి గౌతమ్‌తో పెళ్లిని కన్ఫర్మ్ చేసిన తరువాత వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల ద్వారా వీరిద్దరికి కొన్నేళ్ల క్రితం నుంచే పరిచయం స్పష్టమైంది.
కాగా తాజాగా గౌతమ్ తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో వీరిద్దరు సంప్రదాయ దుస్తుల్లో ఉండగా.. నిశ్చితార్ధం ఫొటో అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పోస్ట్‌కి కాజల్ రిప్లై ఇచ్చారు. ”ఓ పోస్ట్‌లో లవ్ సింబల్‌ని పెట్టిన కాజల్, మరో పోస్ట్‌లో ఇందులో కూడా నీ డిజైనింగ్ తెలుస్తోంది” అని కామెంట్ పెట్టారు. కాగా మొదట ఈ ఇద్దరు ఓ స్టార్ హోటల్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముంబయిలోని కాజల్ ఇంట్లో వీరిద్దరి వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ శుభకార్యానికి కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని.. మీడియాకు అనుమతి లేదని సమాచారం.
Read More: