AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

సాధారణంగా తెలుగు చిత్రాల్లో ఎన్నో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉన్నాయి. ప్రతి పాట శ్రోతల హృదాయలను కదిలించాయి. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి అబ్బాయి హృదయాలను తాకిన పాటలు అనేకం ఉన్నాయి. అందులో ఇప్పటికీ యూట్యూ్బ్ , సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాటల గురించి చెప్పక్కర్లేదు. అందులో అది నన్నే చేరవచ్చే చంచల సాంగ్ ఒకటి.

Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
Chanchala Song
Rajitha Chanti
|

Updated on: May 21, 2026 | 4:33 PM

Share

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలోని చంచల పాట చిత్రీకరణకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ పాటను ఒకే సింగిల్ షాట్‌లో, ఎటువంటి జనరేటర్లు లేదా భారీ లైట్లు లేకుండా చిత్రీకరించామని ఆయన వెల్లడించారు. అప్పట్లో రత్నవేలు అసిస్టెంట్ కెమెరామెన్‌గా, గౌతమ్ మీనన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాజీవ్ మీనన్‌తో కలిసి పనిచేశారు. చెన్నైలోని సామ్ కో బిర్యానీ ప్రసిద్ధి చెందిన ఒక హోటల్‌లో ఈ పాట చిత్రీకరణ జరిగిందని, ఆ హోటల్ వారి కార్యాలయానికి కేవలం రెండు నిమిషాల దూరంలో ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. రాత్రులలో సినిమా చూసిన తర్వాత ఆ హోటల్‌లో బిర్యానీ తినడానికి వెళ్లేవారమని, అది వారికి ఒక మరపురాని ప్రదేశమని తెలిపారు. ఈ పాటను అదే ప్రదేశంలో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి భారీ పరికరాలు లేకుండా, కేవలం ఒక బేబీ లైట్, కొన్ని ట్యూబ్ లైట్లను మాత్రమే ఉపయోగించి, కెమెరాను తన భుజంపై ఉంచి ఈ విజువల్స్ బంధించానని రత్నవేలు వివరించారు. కొరియోగ్రాఫర్ బృందా అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినప్పటికీ, స్టెడీకామ్ లేదా జిమ్మీ జిబ్ వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా, కేవలం తన హ్యాండిల్‌తోనే కెమెరాను నియంత్రించి, సూర్య కదలికలను చిత్రీకరించారు. ఒకే షాట్‌లో సూర్య టేబుల్ ఎక్కడం, డాన్స్ చేయడం, దూకడం, తర్వాత నడుచుకుంటూ వచ్చి, కళ్లకు గంతలు కట్టుకొని బ్యాక్ వాక్ చేసుకుంటూ వాలిపోవడం వంటివి చిత్రీకరించారు. ఈ క్రమంలో సూర్య కుర్చీ తగిలి గాయపడినప్పటికీ, సన్నివేశం సహజత్వం కోసం చిత్రీకరణను కొనసాగించినట్లు ఆయన తెలిపారు. ఇది సినిమా పట్ల ఉన్న అపారమైన ప్యాషన్, ప్రేమ వల్లే సాధ్యమైందని రత్నవేలు అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..

సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులపై, ముఖ్యంగా జనరేషన్ జెడ్‌పై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎంత రియలిస్టిక్‌గా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలో అంతలా కనెక్ట్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. సినిమాలోని సూర్య-సమీరా రెడ్డి లవ్ ట్రాక్, రమ్యతో ఉన్న సన్నివేశాలు, తండ్రి-కొడుకుల బంధం, ప్రేరణ, డ్రగ్స్ ఫేజ్ వంటి ప్రతి అంశం ప్రేక్షకులు తమ జీవితాలకు అన్వయించుకోగలిగారని అన్నారు. సినిమాలో కలర్ ప్యాలెట్ కూడా పాత్రల మానసిక స్థితిని ప్రతిబింబించేలా రూపొందించారు; తండ్రి క్యారెక్టర్ వచ్చినప్పుడు స్క్రీన్ వేరే కలర్‌లో మారడం, లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు బ్లాక్ షేడింగ్ ఎక్కువగా రావడం, మెచ్యూరిటీ వచ్చినప్పుడు కలర్‌ఫుల్‌గా కనిపించడం వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని రత్నవేలు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..

తాజాగా పెద్ది ప్రాజెక్ట్ విషయానికి వస్తే, రామ్ చరణ్ రత్నవేలుపై ఎంతో నమ్మకం ఉంచారని తెలిసింది. పెద్ది కోసం రామ్ చరణ్ మొదటగా రత్నవేలుతోనే మాట్లాడారని, ఆయన్ని కన్ఫర్మ్ చేసుకున్నారని పేర్కొన్నారు. రామ్ చరణ్ తన అభిప్రాయం అడిగినప్పుడు, రత్నవేలు స్క్రిప్ట్ మైండ్ బ్లోయింగ్ అని వెంటనే చెప్పారని తెలిపారు. చిరంజీవి లేదా రజిని సార్ వంటి ప్రముఖుల విషయంలోనైనా, ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదో తాను ఓపెన్‌గా చెప్తానని, ఇదే సినిమాకు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. సుకుమార్ కూడా తన నిజాయితీని ఇష్టపడతారని తెలిపారు. పెద్ది ఒక పెద్ద బడ్జెట్ చిత్రం అని, బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పెద్ద కాస్టింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, భారీ క్రౌడ్ వంటివి ఉంటాయని, స్క్రిప్ట్‌కు తగిన విధంగా ఫైనల్ డెస్టినేషన్‌కు చేరుకోవడానికి ఈ మద్దతు అవసరమని రామ్ చరణ్ భావించారని రత్నవేలు పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..

Follow Us