Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ చెల్లెలు గుర్తుందా.. ? అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 16 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు… అంతలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. దివ్య భారతి, సౌందర్య, సిల్క్ స్మిత వంటి తారలు సినీరంగంలో చక్రం తిప్పారు. చిన్న వయసులోనే కన్నుమూశారు. అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సైతం చిన్న వయసులోనే మరణించారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్.. ఆ తర్వాత అగ్ర హీరోలతో సరసన నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఆమె.. బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికీ ఆర్తి అగర్వాల్ మరణం సినీరంగానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కానీ మీకు తెలుసా.. ? ఆర్తి అగర్వాల్ చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ చెల్లెలు క్రేజీ హీరోయిన్. అక్క బాటలోనే నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఆర్తి అగర్వాల్ మరణం తర్వాత ఆమె చెల్లెలు సైతం సినిమాలకు దూరమైంది. ఆమె పేరు అదితి అగర్వాల్. సరిగ్గా 23 ఏళ్ల కిందట కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా హిట్టు అందుకున్న ఆమె.. ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్టు అందుకోలేకపోయింది. ఆమెకు తన అక్క స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
చివరగా కొడుకు సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమెకు మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ న్యూజెర్సీలో సెటిల్ అయిపోయింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉందట. సినిమాలకు దూరమైనప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం బన్నీతో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

Adithi Agarwal
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
