అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీతో హీరోయిన్గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తుంది ఈ అమ్మడు. నేచురల్ బ్యూటీగా ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సాయి పల్లవి తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది.
ఇది కూడా చదవండి : Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!
సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే .. ఆమెకోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇక సాయి పల్లవి పాత్ర కోసం చాలా కష్టపడుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకోవడమే కాదు. ఆ పాత్రలకు జీవం పోస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సాయి పల్లవి మేకప్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవి ఏ సినిమా కోసం ఇంతగా కష్టపడుతుందో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్.
ఇది కూడా చదవండి :ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు
నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నానికి జోడీగా కృతిశెట్టి, సాయి పల్లవి నటించారు. ఈసినిమాలో దేవదాసిగా నటించింది పల్లవి. అలాగే సినిమా చివరిలో వృద్ధురాలిగా కూడా కనిపించింది. అందుకోసం సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి తన నటనతో కట్టిపడేసింది. అలాగే క్లాసిక్ డాన్స్ లోనూ అదరగొట్టింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.