AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్బీపీతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? 9 ఏళ్లకే సినిమాల్లోకి.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

టాలీవుడ్, కోలీవుడ్.. శాండల్ వుడ్.. ఇలా దక్షిణాదిలో ఏ భాషా సినిమాల్లోనైనా ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దే హవా. సినిమాలకు వేగంగా బాణీలు, పాటలు అందించడం ఈ సంగీత దర్శకుడి స్టైల్. అలాగనీ క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ కాడు. తక్కువ సమయంలో, వినసొంపైన స్వరాలు సమకూరుస్తున్నాడు కాబట్టే దర్శక నిర్మాతలందరూ ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ వెంట పడుతున్నారు.

ఎస్బీపీతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? 9 ఏళ్లకే సినిమాల్లోకి.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
Tollywood Music Director
Basha Shek
|

Updated on: Nov 16, 2024 | 4:03 PM

Share

పై ఫొటోలో దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ బుడ్డోడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు బాణీలు అందిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతున్నాడు. . ముఖ్యంగా సినిమాలకు ప్రాణమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎమ్) ను అద్దిరిపోయే రేంజ్ లో అందించడం ఈ సంగీత దర్శకుడు దిట్ట. అందుకే ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాలో సెన్సేషనల్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా బీజీఎమ్ కోసమే ఈ సంగీత దర్శకుడిని టీమ్ లోకి చేర్చుకున్నారు. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఎస్పీబీతో ఉన్న ఈ పిల్లాడు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్. శనివారం (నవంబర్ 16) అతని పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ మ్యూజిక్ సెన్సేషన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో తమన్ కు చెందిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో తమన్ పేరు ముందుంటుంది. సినిమాల మీద సినిమాల చేస్తూ ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతున్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. అదే సమయంలో ఆహా ఇండియన్‌ ఐడల్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అప్‌కమింగ్‌ సింగర్స్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. తమన్ చేతిలో పలు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, అఖండ 2, ప్రభాస్ ది రాజా సాబ్, పవన్ కల్యాణ్ ఓజీ వంటి బడా సినిమాలున్నాయి.ఇక అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా టీమ్ లో కూడా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ఓజీ సెట్ లో సుజిత్, శింబులతో తమన్..

ఇటీవల హిందీలో సింగమ్ అగైన్ సినిమాకు స్వరాలు అందించాడు తమన్. ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీజాన్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు.

 చిన్నప్పుడు తోటి విద్యార్తులతో కలిసి తమన్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాన్ కార్డుతో నకిలీ రుణాలు.. మీ పేరుపై ఈఎంఐ ఉందా..?
పాన్ కార్డుతో నకిలీ రుణాలు.. మీ పేరుపై ఈఎంఐ ఉందా..?
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..