సంక్రాంతికి  మైత్రి మూవీ మేకర్స్ ఆ సీన్ రిపీట్ చేయనుందా.? 

16 November 2024

Battula Prudvi

ఎమోషన్స్‎తో పాటు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్వచ్ఛమైన తెలుగు కథలకు మరింత డిమాండ్ ఉంటుందని చూపిన సినిమా బలగం.

ప్రియదర్శి హీరోగా వచ్చిన ఈ సినిమా అంతా ఒక ఊళ్ళోనే జరుగుతుంది. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.

అలాగే స్టార్ పవర్ లేకుండా దుమ్ము దులిపేసిన మరో సినిమా మా ఊరి పొలిమేర 2. సత్యం రాజేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు.

కరోనా సమయంలో ఓటిటిలో వచ్చిన మా ఊరి పొలిమేరకు సీక్వెల్ ఇది. గతేడాది విడుదలైన ఈ సీక్వెల్ అదిరిపోయే కలెక్షన్లు తీసుకొచ్చింది.. పార్ట్ 3 కూడా త్వరలోనే రాబోతుంది.

మంగళవారం సినిమా కథ కూడా ఒకే ఊరిలో జరుగుతుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్న అజయ్ భూపతి.. మరోసారి పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథనే నమ్ముకున్నారు.

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన మంగళవారం సినిమాకు మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ కథానాయకిగా నటించిన విరూపాక్ష కథ సైతం మొత్తం ఒకే ఊరిలో జరుగుతుంది.

అక్కడ జరిగే చేతబడులు, దాన్ని ఆపడానికి హీరో పడే కష్టాలు.. ఇవన్నీ చాలా ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు కార్తిక్ దండు.