Nayanathara- Dhanush: నయనతార, ధనుష్‌ల మధ్య వివాదానికి కారణమైన 3 సెక‌న్ల వీడియో ఇదే.. దీనికే 10 కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై నెట్‌ ఫ్లిక్స్ తెరకెక్కస్తోన్న డాక్యుమెంటరీ, నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‌లో.. తన సినిమా నానుమ్ రౌడీ దాన్ సీన్స్ ఉపయోగించుకునేందుకు రూ. 10 కోట్లు డిమాండ్ చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడింది.

Nayanathara- Dhanush: నయనతార, ధనుష్‌ల మధ్య వివాదానికి కారణమైన 3 సెక‌న్ల వీడియో ఇదే.. దీనికే 10 కోట్లా?
Dhanush, Nayanthara
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2024 | 5:29 PM

స్టార్ హీరో ధనుష్- లేడీ సూపర్ స్టార్ నయనతార ల వ్యవహారం కోలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న‌య‌నతార జీవిత కథ ఆధారంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‌ పేరుతో ఒక డాక్యుమెంటరీని తెరకెక్కిస్తోంది. ఇందులో తాను న‌టించిన‌ నానుమ్ రౌడీ దాన్ సినిమాలో నుంచి 3 సెక‌న్ల వీడియోను నయన తార వాడుకుంది. అయితే ఈ 3 సెక‌న్ల వీడియో వాడుకోవ‌డంపై చిత్ర నిర్మాత ధ‌నుష్ న‌య‌నతారకు లీగల్ నోటీసులు పంపించ‌డ‌మే కాకుండా పరిహారం కిం ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో ఈ వివాదంపై విసిగిపోయిన న‌య‌న‌తార ధనుష్‌పై విమ‌ర్శులు కురిపించింది. ఈ మేరకు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేసింది. ఈ నోట్ ప్ర‌స్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది. ఇదిలావుంటే న‌య‌న‌తార‌ను ధ‌నుష్‌ రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ఆ 3 సెక‌న్ల వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజ‌న్లు ఆశ్చర్యపోతున్నారు. ‘కేవ‌లం 3 సెక‌న్ల వీడియోకు రూ.10 కోట్లా’ అంటూ హీరో ధనుష్‌ని ట్రోల్ చేస్తున్నారు.

నయనతారకు పెరుగుతున్న మద్దతు

కాగా ఈ విషయంలో నయన తారకు మద్దతు పెరుగుతోంది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు నటీమణులు నయనతార పోస్టుకు స్పందిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, రియా, అంజ కురియన్, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా, గౌరి జి కిషన్ తదితరులు నయన్ పోస్టును లైక్ చేశారు. నటి పార్వతి ఈ పోస్టను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

త్వరలోనే స్పందిచనున్న ధనుష్..

కాగా నయనతార సంచలన పోస్ట్ పై హీరో ధనుష్ లాయర్ స్పందించాడు. హీరోయిన్ పోస్టుకు త్వరలోనే ధనుష్ తగిన సమాధానం చెబుతాడని పేర్కొన్నారు. కాగా నయన తార, ధనుష్ గతంలో పలు సినిమాలకు కలిసి పనిచేశారు. కలిసి నటించారు కూడా. అలాంటిది ఇప్పుడు వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

నయనతార ఇన్ స్టా పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం