AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఆంధ్రప్రదేశ్‌లో నటి సమంత గుడి ఉందని మీకు తెల్సా.. ఎక్కడంటే?

సినీ స్టార్స్‌ను కొందరు విపరీతంగా అభిమానిస్తారు. ఇంకొదరైతే వారిని దేవుళ్ల మాదిరిగా కొలుస్తారు. మరికొందరు వీరాభిమానులైతే తమ అభిమాన స్టార్స్ కోసం పాదయాత్ర చేయడం, రక్తదానం చేయడం వంటివి చేస్తుంటారు. ఈ అభిమానం పీక్స్‌కి వెళ్లి వారికి గుడి కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలానే ఏపీలో సమంతకు గుడి ఉంది.

Samantha: ఆంధ్రప్రదేశ్‌లో నటి సమంత గుడి ఉందని మీకు తెల్సా.. ఎక్కడంటే?
Samantha Ruth Prabhu
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2024 | 4:29 PM

Share

బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్‌ సమంతకు వీర అభిమాని. ఆమెపై ఉన్న అభిమానాన్ని చూపేందుకు గత ఏడాది ఏకంగా ఆమెకు గుడి కట్టాడు. తన ఇంటి ఆవరణలోనే సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దాని ఆవిష్కరణను ఓ వేడుకలా నిర్వహించాడు. ప్రతి ఏటా నటి బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా సామ్ త్వరగా కోలుకోవాలంటూ మొక్కుబడి యాత్ర చేశాడు. సామంత కోసం తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు సందీప్‌. నటిగా మాత్రమే కాదు ఆమె చేస్తోన్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడ్నై ఈ గుడి కట్టినట్లు సందీప్ తెలిపాడు.

2010లో వచ్చిన ఏంమాయ చేశావో సినిమా నుండి సమంత వీరాభిమానిగా మారాడట సందీప్. అంతే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ.. ఇతర సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడట. దీంతో అప్పటి నుండి సమంత కోసం ఏదో ఒకటి చేయాలని సందీప్ ఆలోచించి.. అభిమానాన్ని చాటుకునేందుకు ఏకంగా ఆమెకు గుడి కట్టాడు. 2023లో సమంత బర్త్ డే రోజున ఈ గుడి ఆవిష్కరణ జరిగింది.

గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్బు, నమితలకు గుడి కట్టారు అభిమానులు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలా నటికి గుడి కట్టిన తొలి వ్యక్తిగా సందీప్ హిస్టరీ క్రియేట్ చేశాడు.

Samantha Temple

Samantha Temple

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..