AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండుతో హీరో, సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా హీరోయిన్.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి.. ముఖ్యంగా ఎన్నో లవ్ స్టోరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా విడుదలై 40ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సినిమా ఇది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

గుండుతో హీరో, సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా హీరోయిన్.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్
Movie News
Rajeev Rayala
|

Updated on: May 10, 2026 | 8:50 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం  కమర్షియల్ విజయాలను మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే అనుభూతిని పంచుతాయి. ఎప్పటికీ బోర్ కొట్టని, ఎప్పుడు చూసిన అద్భుతమైన ఫీల్ ను అందించే సినిమాలు మన తెలుగులో చాలా ఉన్నాయి. అటువంటి అరుదైన చిత్రాల్లో బాలు మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన నిరీక్షణ సినిమా ఒకటి. 1986లో వచ్చింది ఈ సినిమా. 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా, నేటికీ కొంతమందికి మధుర జ్ఞాపకంగా, హృదయాన్ని తాకే చిత్రంగా గుర్తుకు వస్తుంది. నిరీక్షణ చిత్రంలో భానుచందర్ హీరోగా, అర్చన హీరోయిన్‌గా నటించారు. ఒక అందమైన, అమాయకమైన ఆదివాసి యువతికి, నగరంలో పెరిగిన చలాకీ యువకుడికి మధ్య సాగే నిష్కల్మషమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కింది. బాలు మహేంద్ర, దర్శకుడిగా కూడా తన ప్రత్యేకమైన ముద్రను వేశారు. ఆయన ఎంచుకునే కథాంశాలు సున్నితంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. నిరీక్షణ అందుకు చక్కని ఉదాహరణ.

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

బాలు మహేంద్ర మొదట మంచి కథకుడు, రచయితగా తన కళా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఛాయాగ్రాహకుడిగా, దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన 14 లైన్ల కవిత బాలు మహేంద్రను బాగా ఆకట్టుకుంది. ఆ కవిత ఆధారంగా ఆయన ఒక కథను రూపొందించి, 1985లో మలయాళంలో యాత్ర పేరుతో చిత్రాన్ని నిర్మించారు. యాత్ర కేవలం ఆర్థిక విజయాన్ని సాధించడమే కాకుండా, ఉత్తమ చిత్రంగా ప్రభుత్వ అవార్డును కూడా గెలుచుకుంది. అదే కథను నిరీక్షణ పేరుతో తెలుగులోకి తీసుకువచ్చి ప్రేక్షకులను అలరించారు. తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకునే దర్శకుడు జంధ్యాల, లింగమూర్తి అభ్యర్థన మేరకు నిరీక్షణ చిత్రానికి మాటలు రాయడం ఒక విశేషం. యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన భానుచందర్, ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్రలో సరికొత్తగా కనిపించారు. దర్శకుడు బాలు మహేంద్ర కోరిక మేరకు భానుచందర్ గుండు చేయించుకోవడం, ఆ పాత్రకు ఆయన పూర్తి అంకితభావం చూపారనడానికి నిదర్శనం. హీరోయిన్ అర్చన, సినిమా అంతా జాకెట్టు లేకుండా సహజమైన ఆదివాసి యువతిగా నటించారు. అయితే బాలు మహేంద్ర అసభ్యత లేకుండా, చాలా జాగ్రత్తగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

చిత్ర కథ విషయానికి వస్తే, ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ, గిరిజన యువతి తులసి ప్రేమించుకుంటారు. అయితే మురళీకృష్ణ పోలికలతో ఉన్న ఒక తీవ్రవాది ఉండటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. చిత్రహింసల పాలు చేసి, చివరికి ఒక పోలీసు మరణానికి కారణమయ్యాడని అతన్ని జైలుకు పంపుతారు. శిక్ష అనుభవించి విడుదలైన మురళీకృష్ణ, తన కోసం నిరీక్షిస్తున్న తులసిని కలుసుకోవడంతో చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రంలో పోలీస్ స్టేషన్లలో జరిగే చిత్రహింసలు, జైలు జీవితం వంటివి బాలు మహేంద్ర వాస్తవికంగా చూపించారు. చిన్న పాత్రలే అయినా, బాలు మహేంద్రపై అభిమానంతో అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, పి. ఎల్. నారాయణ వంటి ప్రముఖ నటులు నటించడం ఈ సినిమాకు అదనపు బలం. ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతం అందించిన “ఆకాశం ఏనాటిదో అభిమానం ఆనాటిది”, “చుక్కల్లే తోచావే వెన్నెల్లో కాచావే”, వంటి పాటలు ఈ చిత్రానికి ప్రధాన బలం అనే చెప్పాలి. ఈ పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులను హత్తుకుంటూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us