కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇండియాకు గుడ్ బై చెప్పి బ్యాంకాక్‌కు చెక్కేసిన టాలీవుడ్ భామ..
తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..కొన్నేళ్ల క్రితమే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. తేజ సజ్జ, సారా అర్జున్, కావ్య కళ్యాణ్ రామ్, శ్రియ శర్మ ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు చేసి ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. కానీ టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం మాత్రం ఈ అందాల భామకు లేదనే చెప్పాలి. మొదట్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకోవడం కెరీర్ బెడిసి కొట్టింది. దీంతో గ్లామర్ పాత్రలు పోషించేందుకు కూడా రెడీ అయ్యాంది. కానీ ఈ బ్యూటీకి పెద్దగా సినిమాలు కలిసిరాలేదు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?
ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి
ఆమె ఎవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవీకా గోర్. అదే సమయంలో పలు సివిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత అదే క్రేజ్ తో హీరోయిన్ గా మారింది. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది.
ఇది కూడా చదవండి : అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్
ఎలాంటి గ్లామర్ షో లేకుండా చక్కనైనా తెలుగింటి అమ్మాయిలా కనిపించింది అవికా. ఇక ఆ తర్వాత మరోసారి రాజ్ తరుణ్ సరసన జత కట్టింది. సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అవికాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్ళినప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. అవికా గోర్ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్‌కు శాశ్వతంగా మారిన విషయాన్ని తెలిపింది. మేము బ్యాంకాక్‌కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం అని తెలిపింది అవికా గోర్.
ఇది కూడా చదవండి : మనోడు మామూలోడు కాదు.. ఈయన ఆ స్టార్ డైరెక్టర్ అల్లుడా.!! బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
View this post on Instagram




