AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: జైలర్ 2లో రజినీకాంత్‏తో ముఖంపై సిగరెట్ పొగ వదిలే సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి తెలిసిందే. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుడు. తనదైన విలక్షణ నటన, మేనరిజంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే రజినీతో నటించాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. కానీ అలాంటి సూపర్ స్టార్ ముందు సిగరేట్ సీన్ చేయాలంటే.. ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంది హీరోయిన్. ఎవరనేది తెలుసుకుందాం.

Rajinikanth: జైలర్ 2లో రజినీకాంత్‏తో ముఖంపై సిగరెట్ పొగ వదిలే సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
Jailer 2
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2026 | 12:47 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కొన్నాళ్లుగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో హీరోయిన్ విద్యాబాలన్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర రజినీకాంత్ కు ధీటుగా నిలబడే రోల్ అని.. దీంతో తాను ఈ పాత్ర చేయడానికి ముందుగా సందేహాపడ్డానని అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సిగరేట్ సీన్ చేయడం తాను ఊహించిన దానికంటే ఎక్కువగా సవాలుగా మారిందని అన్నారు.

ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన సిగరేట్ సన్నివేశాన్ని మొదటి రోజే చిత్రీకరించాల్సి వచ్చిందట. అయితే రజినీకాంత్ సార్‌కు ఎదురుగా నిలబడే పాత్ర తనదని.. అలాంటి బలమైన పాత్ర పోషించడానికి తాను భయపడ్డానని అన్నారు. ముఖ్యంగా సిగరెట్ కాల్చి, ఆ పొగను రజనీకాంత్ సార్ ముఖం మీదకు ఊదమని డైరెక్టర్ తనకు చెప్పినప్పుడు తాను భయంతో వణికిపోయానని అన్నారు. ఈ ఒక్క సీన్ చేయడానికి తాను ఎంతో ఇబ్బంది పడ్డానని… ఏకంగా మూడు టేకులు తీసుకున్నానని అన్నారు. ఈ సీన్ చేయడానికి తాను వణికిపోతున్నప్పుడు మానిటర్ పై అందరూ గమనించారని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఇక ఇదే విషయాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సైతం వెల్లడించారు. “మేము ఆ షాట్ తీస్తున్నప్పుడు, నేను మానిటర్ వైపు చూశాను. మేడమ్ సిగరెట్ పట్టుకుని, లిప్‌స్టిక్ రాసుకుంటున్నట్లుగా చేతిని ఊపుతున్నారు. ఆ క్షణంలో, ఇది సరిగ్గా కుదరదని నేను అనుకున్నాను. సుమారుగా మూడో టేక్‌లో మాత్రమే మేము దానిని సరిగ్గా తీయగలిగాము. ఇప్పటికీ, మీరు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు, మేడమ్ కళ్లలో కొద్దిగా ఉద్రిక్తత కనిపిస్తుంది,” అని నెల్సన్ అన్నారు. మొదట్లో కాస్త కంగారుపడినప్పటికీ, కొన్ని టేకుల తర్వాత టీమ్ ఆ షాట్‌ను సరిగ్గా చిత్రీకరించగలిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ సీన్ ట్రైలర్ లో కూడా కనిపించింది. జైలర్ 2 అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

విద్యాబాలన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us