AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి వర్గాల్లో మున్సిపల్ సీట్ల పంపకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే వ్యవహారంపై ఓవైపు అంతర్గతంగా చర్చలు కొనసాగుతుండగా.. అటు జనసేన మాత్రం.. మున్సిపల్ సీట్ల పంపకంలో తమ వాటా ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది.ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెగ చర్చకు దారితీస్తోంది.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
Ap Local Elections Jana Sena's Municipal Seat Share Demand Rocks Coalition
Anand T
|

Updated on: Oct 14, 2026 | 12:53 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ సీట్ల పంపకంలో జనసేన పార్టీ వాటాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ వాటా ఇదేనంటూ జనసేన ప్రతిపాదనల జాబితా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రతిపాదిత సీట్ల జాబితాను జనసేన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా.. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ పోస్ట్ చేయడం విశేషం. మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్‌ సహా పలువురు ప్రముఖ జనసేన నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో దీనికి సంబంధించిన వివరాలను పంచుకోవడం ఇప్పుడు కూటమి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 6 మేయర్ స్థానాలను జనసేన కోరుతోంది అందే దాదాపు 35 శాతం వాటా తమకు ఇవ్వాలని జనసేన పేర్కొంది. అలాగే 90 మున్సిపాలిటీల్లో 38 చైర్మన్ స్థానాలను తమకు కేటాయించాలని ప్రతిపాదిస్తోంది అంటే ఇందులో దాదాపు 42 శాతం వాటాను కోరుతోంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో తమకు దక్కాల్సిన ప్రతిపాదిత వాటాను జనసేన శ్రేణులు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి.

ఓ వైపు కూటమి భాగస్వాముల మధ్య సీట్ల పంపకాలపై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఇలా జనసేన నేతలు ఈ ప్రతిపాదిత జాబితాను బహిరంగంగా ప్రచారం చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరీ దీనిపై కూటమి భాగస్వామ్యంలోని బీజేపీ, టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా..? ఓ సారి ఈ వీడియో చూడండి..
ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా..? ఓ సారి ఈ వీడియో చూడండి..