AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకింగ్‌ సేవల్లోకి AI.. కీలక ఫీచర్‌ తీసుకొచ్చిన ప్రముఖ బ్యాంక్‌!

యాక్సిస్ బ్యాంక్ కరెంట్ ఖాతాదారుల కోసం AI ఆధారిత కంప్లయన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలను ప్రారంభించింది. ఇది రీ-కేవైసీ, డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్ అప్‌డేట్‌లను వేగవంతం చేస్తుంది. GST డేటా, జనరేటివ్ AIతో ఈ సేవలు డిజిటల్‌గా, లోపాలు లేకుండా బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

బ్యాంకింగ్‌ సేవల్లోకి AI.. కీలక ఫీచర్‌ తీసుకొచ్చిన ప్రముఖ బ్యాంక్‌!
Axis Bank Ai Banking
SN Pasha
|

Updated on: May 10, 2026 | 8:30 AM

Share

యాక్సిక్‌ బ్యాంక్‌ తన కరెంట్ ఖాతాదారుల కోసం ఏఐ ఆధారిత కొత్త కంప్లయన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలను ప్రారంభించింది. నియంత్రణ ప్రక్రియలను వేగవంతం చేయడం, పూర్తిగా డిజిటలైజ్ చేయడం, కస్టమర్లకు సులభమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం ఈ కొత్త సేవల ప్రధాన లక్ష్యమని బ్యాంక్ వెల్లడించింది. ఈ క్రమంలో బ్యాంక్ రెండు కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో ఏఐ ఆధారిత రీ-కేవైసీ సొల్యూషన్, డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్ అప్‌డేట్ సేవలు ఉన్నాయి. ఈ రెండు సేవల ద్వారా బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కాగితపు పనులు తగ్గిస్తూ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.

కొత్త డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్ అప్‌డేట్ సేవ ద్వారా కరెంట్ ఖాతాదారులు తమ వ్యాపార స్వభావం, వ్యాపార వివరాలు వంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ జనరేటివ్ ఏఐతో పాటు రియల్ టైమ్ జీఎస్టీ ఫైలింగ్ డేటాను ఉపయోగించి, 3,000కు పైగా వ్యాపార కోడ్‌లలో సరైన కోడ్‌ను స్వయంచాలకంగా గుర్తిస్తుంది. దీంతో మాన్యువల్ డేటా ఎంట్రీ అవసరం తగ్గిపోతోంది. బ్యాంక్ ప్రకారం ఈ కొత్త వ్యవస్థ డేటా ఎంట్రీలో జరిగే పొరపాట్లను తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ వేగాన్ని పెంచుతుంది. అలాగే కార్యాచరణ బృందాల పనిభారం కూడా తగ్గుతుంది. జీఎస్టీ డేటాతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎమ్‌) టెక్నాలజీని పెద్ద స్థాయిలో ఉపయోగించడం ఇదే తొలిసారి అని బ్యాంక్ పేర్కొంది.

ఇక వ్యక్తిగతేతర కరెంట్ ఖాతాదారుల కోసం ఏఐ ఆధారిత రీ-కేవైసీ సిస్టమ్‌ను కూడా బ్యాంక్ ప్రవేశపెట్టింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తిగా మాన్యువల్‌గా ఉండేది. ఇప్పుడు ఒకే పీడీఎఫ్ ఫైల్‌లో ఉన్న పలు కేవైసీ పత్రాలను సిస్టమ్ స్వయంచాలకంగా గుర్తించి, సమాచారాన్ని సంగ్రహించి ధృవీకరిస్తుంది. పత్రాల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే హెచ్చరికలు కూడా ఇస్తుంది. ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ద్వారా నియంత్రణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యమని బ్యాంక్‌ అధికారులు తెలిపారు. జనరేటివ్ ఏఐ, డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ జీఎస్టీ డేటా కలయికతో సంక్లిష్ట ప్రక్రియలను వేగంగా పూర్తి చేయవచ్చని అన్నారు. ఈ కొత్త సేవల ద్వారా కస్టమర్లకు కాగితరహిత, వేగవంతమైన, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ అనుభవం లభిస్తుందని బ్యాంక్ విశ్వసిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us