AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన 3 కార్డులు ఇవే.. మీ భవిష్యత్తుకు ఎంతో కీలకం..

18 ఏళ్లు రాగానే ఓటు వేసే హక్కు మాత్రమే కాదు.. భారత ప్రభుత్వం నుంచి అత్యంత కీలకమైన సర్కారీ కార్డులు పొందే అర్హత కూడా వస్తుంది. కానీ చాలామంది వీటిని కరెక్ట్ టైమ్‌లో తీసుకోక ఆ తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అసలు బాధ్యతగల పౌరుడిగా మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సిన ఆ కార్డులు ఏంటీ? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన 3 కార్డులు ఇవే.. మీ భవిష్యత్తుకు ఎంతో కీలకం..
Important Government Ids After Turning 18Image Credit source: AI Image
Krishna S
|

Updated on: Jul 21, 2026 | 8:01 PM

Share

భారతదేశంలో 18 ఏళ్ల వయస్సు పూర్తికాగానే ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా పెద్దలుగా మారుతారు. ఈ వయసులోకి అడుగుపెట్టగానే ఒకవైపు కొత్త హక్కులు, స్వేచ్ఛ లభిస్తే.. మరోవైపు సమాజంలో కొన్ని బాధ్యతలు కూడా తోడవుతాయి. అయితే చాలామందికి 18 ఏళ్లు రాగానే యువకులు దరఖాస్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రభుత్వ పత్రాల గురించి సరైన అవగాహన లేదు. భవిష్యత్తులో ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఆర్థిక లావాదేవీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వెంటనే ప్రతి ఒక్కరూ పొందాల్సిన మూడు అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ కార్డులు, వాటి ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం..

డ్రైవింగ్ లైసెన్స్

18 సంవత్సరాలు నిండిన వెంటనే దేశంలో వాహనాలను చట్టబద్ధంగా నడిపే హక్కు లభిస్తుంది. అయితే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. రవాణా శాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా అప్లై చేసుకోవచ్చు. మొదట దరఖాస్తు చేసుకుంటే లర్నింగ్ లైసెన్స్ లభిస్తుంది. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే పక్కా డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.

ఓటర్ ఐడీ కార్డ్

18 ఏళ్ల తర్వాత అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు ఓటు హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములై, నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అధికారం దీనిద్వారా లభిస్తుంది. ఓటరు జాబితాలో పేరు నమోదు లేదా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఫామ్-6 పూర్తి చేసి ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

పాన్ కార్డ్

ఈ మూడో కార్డు నేటి కాలంలో ప్రతి సామాన్య పౌరుడికి, విద్యార్థికి అత్యంత ముఖ్యమైనది. బ్యాంక్ ఖాతా తెరవడం, ఎడ్యుకేషన్ లోన్ లేదా ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ యత్నాలలో ఉన్న యువతకు రూపాయి లావాదేవీ జరగాలన్నా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చాలా సులభంగా పాన్ కార్డ్ దరఖాస్తు కోసం చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డిజిటల్ ఇండియా చొరవతో ఈ మూడు కార్డుల దరఖాస్తు ప్రక్రియలు పూర్తిగా ఆన్‌లైన్, పారదర్శకంగా మారాయి. కాబట్టి దళారులను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పూరించే సమయంలో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ స్పెల్లింగ్‌లు మీ సర్టిఫికెట్‌లో ఉన్న విధంగానే ఉండేలా చూసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో కరెక్షన్ల కోసం ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.

Follow Us