Anupama: అనుపమ బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన డిజే టిల్లు 2 చిత్ర యూనిట్..
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజేటిల్లు చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్..
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజేటిల్లు చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే పనిలో పడింది. డీజేటిల్లు స్క్వేర్ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగింది. అయితే చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా నటిస్తోందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే అనుపమ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుపమ టిల్లు స్క్వేర్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. టిల్లు స్వ్కేర్ మూవీలో అనుపమ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అనుపమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మూవీ యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఇందులో అనుపమ చబ్బీ అండ్ ట్రండీ లుక్స్‌లో ఆకట్టుకుంటోంది.
Wishing the very gorgeous, our @anupamahere a very happy birthday.? – team #TilluSquare #HBDAnupamaParameswaran ✨#Siddu @MallikRam99 @ram_miriyala @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/kCjtLPegij
— Sithara Entertainments (@SitharaEnts) February 18, 2023
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్‌గా శ్రీలీల, మడోన్నా సెబాస్టియస్, మీనాక్షి చౌదరి వంటి పేర్లు వినిపించినా మొదట అనుకున్న అనుపమనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ట్‌టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా డీజే టిల్లును మించిన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..