Yatra 2: యాత్ర సీక్వెల్‌పై హింట్ ఇచ్చిన దర్శకుడు.. జగన్ పాత్రలో నటించే హీరో ఎవరంటే.?
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాద యాత్రలో చోటు చేసుకున్న కీలక సంఘటనలు, సంక్షేమ పథకాలను ఎలా..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాద యాత్రలో చోటు చేసుకున్న కీలక సంఘటనలు, సంక్షేమ పథకాలను ఎలా రూపొందించారు అన్న అంశాలను అద్భుతంగా చూపించారు. రాజ శేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుత నటనను ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని యాత్ర విడుదల సమయంలోనే దర్శకుడు తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతోన్నా ఇప్పటికీ సీక్వెల్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మహి వి. రాఘవ ‘సేవ్ ది టైగర్స్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మహి వి రాఘవ ‘యాత్ర’ సిక్వెల్ ‘యాత్ర-2’ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన యాత్ర 2 ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే సినిమా పట్టాలెక్కేది ఎప్పుడనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక యాత్ర-2 చిత్రం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి. రాజశేఖర్ రెడ్డి మరణం, ఆ తర్వాత జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు, చివరికి ముఖ్యమంత్రి ఎలా అయ్యారన్న ఇతివృత్తంగా సీక్వెల్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ పాత్ర కోసం.. స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించి 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..