AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఢీ’ సీక్వెల్‌కు రెడీ అవుతున్న క్రేజీ కాంబినేషన్.. మంచు విష్ణు బర్త్‌డే సందర్భంగా పోస్టర్ రిలీజ్..

హీరో మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం వచ్చిన 'ఢీ' మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇదే కాంబినేషన్ సుధీర్ఘ విరామం తర్వాత మరోసారి వస్తోంది. 'ఢీ'కి సీక్వెల్‌గా 'డి & డి' టైటిల్‌తో సినిమా చేయ‌డానికి వారు రెడీ అవుతున్నారు.

'ఢీ' సీక్వెల్‌కు రెడీ అవుతున్న క్రేజీ కాంబినేషన్.. మంచు విష్ణు బర్త్‌డే సందర్భంగా పోస్టర్ రిలీజ్..
uppula Raju
|

Updated on: Nov 23, 2020 | 5:44 PM

Share

హీరో మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇదే కాంబినేషన్ సుధీర్ఘ విరామం తర్వాత మరోసారి వస్తోంది. ‘ఢీ’కి సీక్వెల్‌గా ‘డి & డి’ టైటిల్‌తో సినిమా చేయ‌డానికి వారు రెడీ అవుతున్నారు. ‘డ‌బుల్ డోస్’ అనేది ట్యాగ్‌లైన్‌. విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. సంకెళ్ల మ‌ధ్య రెండు ‘డి’ అక్ష‌రాల‌ను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఎంత కామెడీ, యాక్ష‌న్ ఉన్నాయో అంత‌కు రెట్టింపు కామెడీ, యాక్ష‌న్ ఈ సినిమాలో ఉంటాయ‌నే సంకేతాన్నిస్తూ ‘డ‌బుల్ డోస్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవ‌ర‌మ్ భ‌క్త మంచు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ‘ఢీ’తో స‌హా శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన ప‌లు సినిమాల‌కు ప‌నిచేసిన ర‌చ‌యిత గోపీమోహ‌న్, మ‌రో పాపుల‌ర్ రైట‌ర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్న‌ యంగ్ సెన్సేష‌న్ మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, మోహ‌న‌కృష్ణ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇండియాలో నంబ‌ర్ వ‌న్ ఫైట్‌మాస్ట‌ర్‌గా పేరుపొందిన పీట‌ర్ హెయిన్ ‘డి & డి’లో హైవోల్టేజ్ యాక్ష‌న్ సీన్స్‌ను రూపొందించ‌నున్నారు. ఎం.ఆర్‌. వ‌ర్మ ఎడిట‌ర్‌గా, చిన్నా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. విష్ణు జోడీగా ఎవ‌రు న‌టించేదీ, ఇత‌ర తారాగ‌ణం వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్లడిస్తామని తెలిపారు.

Follow Us
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?