కరోనాకు భయపడనంటోన్న స్టార్ డైరక్టర్.. షూటింగ్ కానిచ్చేస్తున్నాడు..!
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో అందరిలో భయం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో అందరిలో భయం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లకే పరిమితమై కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే ఓ స్టార్ డైరక్టర్ మాత్రం తన మూవీ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఇంతకు ఆయనెవరంటే.. శేఖర్ కమ్ముల.
2017లో ఫిదాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల ఆ తరువాత దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నారు. ఆ తరువాత నాగ చైతన్యతో లవ్ స్టోరీ మూవీని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ మూవీ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో కరోనాను పట్టించుకోకుండా ఆయన తన సినిమా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్‌నగర్‌లో జరుగుతుండగా.. అందులో ప్రధాన పాత్రాధారులైన నాగ చైతన్య, సాయి పల్లవిలపై ఆయన చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. షూటింగ్ అయితే చేస్తున్నారు కానీ.. కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.